MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 CSK vs DC: రిషబ్ పంత్, పృథ్వీషా మెరుపులు... ఫైనల్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ముందు...

IPL2021 CSK vs DC: రిషబ్ పంత్, పృథ్వీషా మెరుపులు... ఫైనల్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ముందు...

ఐపీఎల్ 2021 మొదటి క్వాలిఫైయర్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగుల స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే సీఎస్‌కే ఫైనల్ చేరుతుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 10 2021, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్‌, 7 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

29

ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కోసం పోటీపడుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా 8 బంతుల్లో ఒకే పరుగు చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... 

39

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

49

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో పృథ్వీషా క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీపక్ చాహార్ వేసిన 3వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు...

59

27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పృథ్వీషా, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో అర్ధశతకం బాదిన మొట్టమొదటి ఢిల్లీ ప్లేయర్‌గా నిలిచాడు...

69

34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన పృథ్వీషా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి డుప్లిసిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగులు చేస్తే, అందులో 60 పరుగులు షా చేసినవే కావడం విశేషం...

79

80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని హెట్మయర్, రిషబ్ పంత్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 83 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు...

89

24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన హెట్మయర్, బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

99

రిషబ్ పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హాఫ్ సెంచరీ బాదాడు. 20వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak : మృత్యువుతో పోరాడి గెలిచాడు.. తిలక్ వర్మను వణికించిన ఆ భయంకర వ్యాధి ఏంటో తెలుసా?
Recommended image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
Recommended image3
RCB vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved