MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !

RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !

Rajasthan Royals vs Kolkata Knight Riders: బౌల‌ర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు  క్వింట‌న్ డీకాక్ సూప‌ర్ నాక్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఆడుతూ పాడుతూ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) విజ‌యం సాధించింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 26 2025, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Quinton de Kock

Quinton de Kock

Rajasthan Royals vs Kolkata Knight Riders: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) - కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) లు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో 6వ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. గౌహ‌తిలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో అజింక్య ర‌హానే కెప్టెన్సీలోని కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. క్వింట‌న్ డీకాక్ సూప‌ర్ నాక్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్  చేసి 151/9 ప‌రుగులు చేసింది. ఈ స్వ‌ల్ప టార్గెట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ క్వింటన్ డీ కాక్  అద్భుతమైన హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో ఈజీగానే అందుకుంది. 

34
Image Credit: Twitter/KKR

Image Credit: Twitter/KKR

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే 20 ఓవర్లలో 151/9 ప‌రుగులు చేసింది. ధ్రువ జురేల్ 33 పరుగులు, జైస్వాల్ 29, ప‌రాగ్ 25 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. కేకేఆర్ బౌలింగ్  దెబ్బ‌కు ప‌రుగులు చేయ‌డానికి ఆర్ఆర్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. అరోరా 2, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2, హ‌ర్షిత్ రాణా 2, మోయిన్ అలీ 2 వికెట్లు తీసుకున్నారు.

 

44
Team KKR (Photo: IPL)

Team KKR (Photo: IPL)

బ్యాటింగ్ లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయిన రాజస్థాన్ రాయ‌ల్స్ టీమ్ బౌలింగ్ లో కూడా కేకేఆర్ ను అడ్డుకోలేక‌పోయింది. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డీ కాక్ మొద‌టి నుంచి దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఆ త‌ర్వాత కూడా మ‌రింత దూకుడుగా ఆడుతూ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

అయితే, టార్గెట్ మ‌రింత పెద్ద‌దిగా ఉండివుంటే డీకాక్ త‌న సెంచ‌రీని పూర్తి చేసేవాడు. అత‌ను 97 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 61 బంతుల్లో 97* ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు. అత‌నికి తోడుగా ర‌ఘువంశీ 22 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. 17.3 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 153 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image2
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved