MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • హెన్రిచ్ క్లాసెన్ తో నష్టపోయిన నితీష్ కుమార్ రెడ్డి.. SRH అందుకే అలా చేసిందా?

హెన్రిచ్ క్లాసెన్ తో నష్టపోయిన నితీష్ కుమార్ రెడ్డి.. SRH అందుకే అలా చేసిందా?

IPL 2025:  సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముందే భారత యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంది. అయితే, అతనికి తక్కువ మొత్తాన్ని కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ టీమ్ ఎందుకు అలా చేసింది? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 31 2024, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నితీష్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. మెల్ బోర్నలో లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. 221/6తో ఇబ్బంది పడుతున్న భారత్ జట్టును 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన తెలుగు ప్లేయర్ 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాది సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

తొలి టెస్ట్ సిరీస్‌లోనే సెంచరీతో నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సర్కిల్ హాట్ టాపిక్ గా మారాడు. గత సీజన్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లను ఆడిన నితీష్ రెడ్డి.. IPL 2025లో కీలక ఆటగాడిగా మారనున్నాడు. అయితే, IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే నితీష్ కుమార్ రెడ్డికి దక్షిణాఫ్రికా ఆటగాడి వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాడని మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న హైదరాబాద్ టీమ్ 

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా గత IPL వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షలకు టీమ్ లోకి తీసుకుంది. అయితే, IPL 2024లో అతను 13 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు. అలాగే, 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో గత నవంబర్‌లో జరిగిన IPL వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది.

ఈ వేలానికి ముందు, నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. భారత జట్టులో అతని స్థానం, T20లలో అతని ఆల్‌రౌండర్ ప్రదర్శనల కారణంగా వేలంలో అతనికి 10 కోట్లకు పైగా ధర పలుకుతుందని అందరూ భావించారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

35
నితీష్ కుమార్ రెడ్డి IPL

నితీష్ కుమార్ రెడ్డి IPL

ఎందుకు నితీష్ కుమార్ కు SRH ఎక్కువ కేటాయించలేదు

ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నితీష్ కుమార్ రెడ్డిని 11 కోట్లకు నిలుపుకోవాలని ముందుగా ప్లాన్ చేసింది. అయితే, దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను నిలుపుకోవడానికి 23 కోట్లు ఖర్చు చేయడం వల్ల నితీష్ రెడ్డికి ఎక్కువ మొత్తం కేటాయించలేకపోయారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 119 కోట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు ఆటగాళ్ల కోసం 69 కోట్లు ఖర్చు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), ట్రావిస్ హెడ్ (14 కోట్లు) వారిలో ఉన్నారు. దీంతో మిగిలిన ఆటగాళ్ల కోసం హైదరాబాద్ టీమ్ వద్ద పెద్దగా బడ్జెట్ మిగలలేదు.

45
హెన్రిచ్ క్లాసెన్

హెన్రిచ్ క్లాసెన్

హెన్రిచ్ క్లాసెన్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన నితీష్ కుమార్ రెడ్డి

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగు లేదా ఐదు కోట్లు తక్కువకు కొనుగోలు చేసి ఉంటే, మిగిలిన మొత్తం నితీష్ కుమార్ రెడ్డికి వెళ్లేది, అతన్ని 10 లేదా 11 కోట్లకు నిలుపుకునేవారు. అయితే, హైదరాబాద్ ఎలాగైనా ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే, ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకుంద. మొదటి రిటెన్షన్ గా క్లాసెన్ ను తీసుకుంటూ అతనికి భారీ మొత్తాన్ని కేటాయించింది. దీంతో క్లాసెన్ వల్ల నితీష్ కుమార్ రెడ్డి కొన్ని కోట్లు నష్టపోయాడు.

55
Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025

Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025

ఐపీఎల్ 2025 - స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ లో ఎవ‌రెవరున్నారు? 

రిటైన్ ప్లేయ‌ర్లు :

1. హెన్రిచ్ క్లాసెన్
2. ట్రావిస్ హెడ్
3. అభిషేక్ శర్మ
4. నితీష్ కుమార్ రెడ్డి
5. పాట్ కమిన్స్

వేలంలో కొనుగోలు చేసిన ప్లేయ‌ర్లు :

1. మ‌హ్మద్ షమీ: 10 కోట్లు
2. హర్షల్ పటేల్: 8 కోట్లు
3. ఇషాన్ కిషన్: 11.25 కోట్లు
4. రాహుల్ చాహర్: 3.20 కోట్లు
5. ఆడమ్ జంపా: 2.40 కోట్లు
6. అథర్వ తైడే: 30 లక్షలు
7. అభినవ్ మనోహర్: 3.20 కోట్లు
8. సిమర్జీత్ సింగ్: 1.5 కోట్లు
9. జీషన్ అన్సారీ: 40 లక్షలు
10. జయదేవ్ ఉనద్కత్: 1 కోటి
11. బ్రైడాన్ కార్స్: 1 కోటి
12. కమిందు మెండిస్: 75 లక్షల
13. అనికేత్ వర్మ: 30 లక్షలు
14. ఎషాన్ మలింగ: 1.20 కోట్లు
15. సచిన్ బేబీ: 30 లక్షలు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved