14 ఏళ్ల వయసులో HIV టెస్టు చేయించుకున్న శిఖర్ ధావన్... కారణం ఏంటంటే...
టీమిండియాకి దశాబ్ద కాలానికి పైగా ఓపెనర్‌గా వ్యవహరించాడు శిఖర్ ధావన్. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసిన శిఖర్ ధావన్‌కి టెస్టుల్లో రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. 2022 తర్వాత వన్డేల్లో కూడా చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు...

Shikhar Dhawan
శిఖర్ ధావన్ క్యాచ్ పట్టిన తర్వాత తొడ కొట్టి సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాగే సెంచరీ చేసిన తర్వాత మీసం తప్పితూ సెలబ్రేట్ చేసుకుంటాడు. శిఖర్ ధావన్ ఈ స్టైల్ సెలబ్రేషన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే అతనికి టాటూలంటే భలే పిచ్చి...
విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ మాదిరిగానే శిఖర్ ధావన్ కూడా తన ఒంటి మీద టాటూలతో కనిపిస్తాడు. అయితే ధావన్, తెలిసి తెలియని వయసులో తొలి టాటూ వేయించుకున్నాడు. అది ఎంత దాకా వచ్చిందంటే హెచ్‌ఐవీ సోకిందమోనని టెస్టు చేయించుకునేదాకా...
‘నాకు 14-15 ఏళ్లు ఉన్నప్పుడు అనుకుంటా స్కూల్ పిల్లలతో కలిసి మనాలి ట్రిప్‌కి వెళ్లాను. అక్కడ టాటూ వేసేవాళ్లు కనిపిస్తే, ఇంట్లో వాళ్లకు తెలియకుండా వీపు మీద ఓ టాటూ వేయించుకున్నా. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా కొన్ని రోజులు దాచాను...
అయితే 3-4 నెలల తర్వాత మా నాన్నకు అది కనిపించింది. దాంతో ఆయన చితకబాదారు. అందరికీ తెలిసిపోయాక నాకు చాలా భయమేసింది. టాటూ వేసేందుకు సూది వాడారు. ఎంతమందికి ఆ సూది వాడిందో, ఎంత ప్రాణాంతక వైరస్ దాంట్లో ఉందోనని అనుమానం వచ్చింది..
వెంటనే ఆసుపత్రికి వెళ్లి HIV పరీక్ష చేయించుకున్నా, రిజల్ట్ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా.. నా వీపు మీద వేయించుకున్న మొదటి టాటూ తేలు.. ఆ సమయంలో నా ఆలోచన అలాగే ఉండేది...
కొన్ని రోజుల తర్వాత దానికి మరికొన్ని డిజైన్స్ వేయించా. నా చేతిపైన శివుడి టాటూ కూడా ఉంటుంది. అలాగే మన బెస్ట్ ఆర్చర్ అర్జునుడి టాటూ కూడా వేయించుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్..
37 ఏళ్ల శిఖర్ ధావన్, 2023 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో తనకి చోటు ఉంటుందని ఆశించాడు. అయితే మూడు ఫార్మాట్లలో టీమ్‌కి దూరం కావడంతో ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత శిఖర్ ధావన్, రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..