- Home
- Sports
- Cricket
- ఇలాగే ఆడితే, నీ చెంప గట్టిగా పగులుద్ది! టీమిండియాలోకి రాగానే... శుబ్‌మన్ గిల్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
ఇలాగే ఆడితే, నీ చెంప గట్టిగా పగులుద్ది! టీమిండియాలోకి రాగానే... శుబ్‌మన్ గిల్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
టీమిండియాలో ఏడాదిగా శుబ్‌మన్ గిల్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ వరుసగా వన్డే సిరీస్‌లకు దూరం కావడంతో అతని ప్లేస్‌ల్లో వన్డేల్లోకి వచ్చి అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్లేస్‌కే ఎసరుపెట్టాడు. టీ20ల్లో సెంచరీ చేసి కెఎల్ రాహుల్‌ని టీమ్‌కి దూరం చేశాడు..

(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000394B)
వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి అరుదైన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు శుబ్‌మన్ గిల్...
(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000401B)
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000394B)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 14 పరుగులే చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసి సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్ ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా 67 పరుగులే చేయగలిగాడు..
‘శుబ్‌మన్ గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 9 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వేగం పెంచాడు. షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. గిల్ హాఫ్ సెంచరీ తర్వాత కూడా వేగం పెంచకపోయి ఉంటే గుజరాత్ టైటాన్స్ ఆఖరి ఓవర్‌లో 17-20 పరుగులు చేయాల్సి వచ్చేది..
ఎలాగో మ్యాచ్ గెలిచేస్తాం కాబట్టి నేను హాఫ్ సెంచరీ చేసుకుంటా అని శుబ్‌మన్ గిల్ ఆలోచించి ఉండొచ్చు. ఇది క్రికెట్. ఇందులో వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఉండదు. ముందు టీమ్ గురించి, విజయం గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే మిగిలిన విషయాలు వస్తాయి...
Image credit: PTI
నేను ఇలాగే ఆడుతానని అనుకుంటే త్వరలోనే నీ చెంప గట్టిగా పగులుతుంది. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడేవాళ్లకి టీమ్‌లో ప్లేస్ ఉండదు. శుబ్‌మన్ గిల్ మాత్రమే కాదు, ప్రతీ ప్లేయర్‌కి ఈ నియమం వర్తిస్తుంది. హాఫ్ సెంచరీ దగ్గరికి రాగానే మెల్లిగా ఆడుతాం, అది పూర్తయ్యాక వేగం పెంచుతాం అంటే టీమ్‌కి అన్యాయం జరుగుతుంది..
Shubman Gill
చేతిలో చాలా వికెట్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్ వరకూ వెళ్లాల్సిన మ్యాచ్ కానే కాదు. హాఫ్ సెంచరీకి ముందు కూడా శుబ్‌మన్ గిల్ 200 స్ట్రైయిక్ రేటుతో ఆడి ఉంటే, రిజల్ట్ ఎప్పుడో వచ్చి ఉండేది. ఎప్పుడూ కూడా తర్వాతి బ్యాటర్లకు వీలైనన్ని ఎక్కువ బంతులు మిగల్చడమే గొప్ప బ్యాటర్ చేయాల్సింది..
Image credit: PTI
బ్యాటింగ్ చేయడానికి పిచ్ కష్టంగా ఉంటే బౌండరీలు కొట్టడం కష్టమవుతుంది. అయితే పిచ్ ఎలా ఉన్నా, టీ20ల్లో దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించాలి. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు, డిఫెన్సింగ్‌గా ఆడతా అంటే సెట్ కాదు.
Virat Kohli-Shubman Gill
రాహుల్ తెవాటియా చివర్లో బౌండరీ కొట్టకపోతే, మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేదేమో.. టీమిండియాలోకి వచ్చాక గిల్ ఆటతీరులో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది, ఇది అతనికి మంచిది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..