- Home
- Sports
- Cricket
- ఎవడ్రా వాడిని బ్యాటింగ్‌కు పంపింది.. అదే మిమ్మల్ని ముంచింది.. లక్నోపై సెహ్వాగ్ గరం గరం
ఎవడ్రా వాడిని బ్యాటింగ్‌కు పంపింది.. అదే మిమ్మల్ని ముంచింది.. లక్నోపై సెహ్వాగ్ గరం గరం
IPL 2023: ఐపీఎల్-16లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో 56 పరుగుల తేడాతో ఓడింది.

పంజాబ్ కింగ్స్‌పై 257 పరుగుల భారీ స్కోరు సాధించి గెలిచిన తర్వాత లక్నో సూపర్ కింగ్స్ కు ఏదీ అచ్చిరావడం లేదు. ఈ మ్యాచ్ ముగిశాక లక్నో.. సొంతగడ్డపై బెంగళూరు, చెన్నైలతో ఆడింది. బెంగళూరుతో లో స్కోరింగ్ గేమ్ లో ఓడటమే గాక ఈ మ్యాచ్ లో కోహ్లీ - నవీన్ ఉల్ హక్ - గంభీర్ ల మధ్య నెలకొన్న వాగ్వాదంతో లక్నో నానా రచ్చ అయింది. ఈ దెబ్బతో ఫెయిర్ ప్లే అవార్డులలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న లక్నో ఆ తర్వాత 8 వ స్థానానికి పడిపోయింది.
Image credit: PTI
ఇదే మ్యాచ్ లో రాహుల్, ఉనద్కత్ లు గాయపడటం లక్నోకు కోరుకోని బోనస్ వంటిది. చెన్నైతో మ్యాచ్ లో వర్షం కారణంగా ఒక ఇన్నింగ్సే జరిగి ఫలితం తేలలేదు. ఇక గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ను అన్నాదమ్ముల పోరుగా చూశారు అభిమానులు. కానీ అన్న కృనాల్ పై తమ్ముడు హార్ధిక్ దే పైచేయి.
అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్య ఛేదనను లక్నో బాగానే ప్రారంభించింది. లక్నో ఓపెనర్లు కైల్ మేయర్స్, డికాక్ లు ఫస్ట్ వికెట్ కు 88 పరుగులు జోడించారు. కానీ మూడో స్థానంలో ఆ జట్టు ఫామ్ లో లేని దీపక్ హుడాను దింపింది. లక్నో ఓడటానికి ఈ నిర్ణయమే కారణమంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిక్‌బజ్ లో వీరూ మాట్లాడుతూ.. ‘ఛేదనలో ఒకదశలో లక్నో 10 ఓవర్లకు 102-1 గా ఉంది. ఈ లెక్కన చూస్తే వాళ్లు మ్యాచ్ కోల్పోకూడదు. ఒకవేళ ఓడినా మరీ ఇంత ఎక్కువ మార్జిన్ తో అయితే ఓడకూడదు. కానీ ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత ఎవరైనా ఫామ్ లో ఉన్న బ్యాటర్ వస్తాడనుకున్నా..
అది నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అయుష్ బదోని లలో ఎవరో ఒకరు వస్తారని భావించా. ఎవరూ లేకుంటే భారీ షాట్లు ఆడే కెప్టెన్ కృనాల్ అయినా వస్తాడేమోనని అనుకున్నా. కానీ ఎవరొచ్చారు..? దీపక్ హుడా. ఇదిగో ఇక్కడే లక్నో మ్యాచ్ లో ఓడిపోవడానికి బీజాలు పడింది.
Image credit: PTI
నాకు తెలిసి ఇది తెలివితక్కువ నిర్ణయం. ఒకవేళ పూరన్ గనక వచ్చి ఉంటే గత మ్యాచ్ లలో అతడి ప్రదర్శనను బట్టి చూస్తే అతడు ఓ 20 బంతుల్లో 50 రన్స్ కొట్టేవాడు. అప్పుడు మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అయూష్ బదోని లాస్ట్ లో వచ్చి 11 బంతుల్లో 22 రన్స్ కొట్టాడు. ఒకవేళ అతడైనా ముందే వచ్చి ఉంటే అతడు రన్ రేట్ ను పెంచేవాడు..
కానీ ఇది (దీపక్ హుడాను మూడోస్థానంలో పంపడం) ఎవరి నిర్ణయం..? కెప్టెన్ దా? టీమ్ మేనేజ్మెంట్ దా..? కోచ్ దా..? హుడాను 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపిందెవరు..? అక్కడ కచ్చితంగా ఇన్ ఫామ్ బ్యాటర్లే వచ్చి ఉండాల్సింది..’అని చెప్పాడు.
Image credit: PTI
ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన దీపక్ హుడా.. 7.11 సగటులో 64 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పది ఇన్నింగ్స్ లలో అతడి స్కోరు వివరాలు ఇవి : 12, 2, 7, 9, 2, 2, 2, 11, 1, 11. ఈ గణాంకాలు చూస్తే వీరూ కోపంలో తప్పేమీ లేదనిపించదు.