- Home
- Sports
- Cricket
- నీ జిడ్డు బ్యాటింగ్ వల్లే ఓడిపోతున్నాం! ఆరెంజ్ క్యాప్ కోసం ఆడుతున్నావా... విరాట్ కోహ్లీపై ట్రోల్స్...
నీ జిడ్డు బ్యాటింగ్ వల్లే ఓడిపోతున్నాం! ఆరెంజ్ క్యాప్ కోసం ఆడుతున్నావా... విరాట్ కోహ్లీపై ట్రోల్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 5లో పోటీపడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లిసిస్, 511 పరుగులతో టాప్‌లో ఉంటే యశస్వి జైస్వాల్ 477, శుబ్‌మన్ గిల్ 469, డివాన్ కాన్వే 458 పరుగులతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000409B)
10 మ్యాచుల్లో 46.56 సగటుతో 419 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో ఇప్పటికే 6 హాఫ్ సెంచరీలు చేసి, అత్యధిక అర్ధ శతకాలు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు...
Image credit: PTI
అయితే విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు మాత్రం 135.16 మాత్రమే. ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 15 మందిలో డేవిడ్ వార్నర్ ఒక్కడే (స్ట్రైయిక్ రేటు 120.44) విరాట్ కోహ్లీ కంటే తక్కువ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు..
Image credit: PTI
విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఈ సీజన్‌లో 39 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తంగా 50 బౌండరీలు సాధించాడు. టాప్ 5లో ఉన్న ప్లేయర్లలో అతి తక్కువ బౌండరీలు చేసిన బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీయే...
ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో 140+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు రాబడుతున్న విరాట్ కోహ్లీ, స్పిన్నర్ బౌలింగ్‌లో 109+ స్ట్రైయిక్ రేటును మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు. ఇది అతన్ని మాత్రమే కాకుండా టీమ్‌ని కూడా ప్రభావితం చేస్తోంది..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులే చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ 46 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. విరాట్ స్ట్రైయిక్ రేటు 119.57 మాత్రమే...
ఫాఫ్ డుప్లిసిస్ 140.62 స్ట్రైయిక్ రేటుతో 45 పరుగులు చేయగా కుర్రాడు మహిపాల్ లోమ్రార్ 186.21 స్ట్రైయిక్ రేటుతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కాస్త వేగంగా పరుగులు చేసి ఉంటే, ఆర్‌సీబీ స్కోరులో 20-30+ పరుగులు ఈజీగా చేరి ఉండేవి...
PTI Photo/Shailendra Bhojak) (PTI04_15_2023_000132B)
ఆర్‌సీబీ 200 మార్కు దాటి ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యేవాళ్లు, బెంగళూరుకి విజయావకాశాలు ఎక్కువగా ఉండేది. విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్, ఆర్‌సీబీకి పెద్ద భారంగా మారింది...
Virat Kohli
అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... లక్నోతో మొదటి మ్యాచ్‌లో 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో 140 కంటే తక్కువ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీయే..
లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులే చేశాడు. విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు కారణంగా 20+ పరుగులు తక్కువగా చేస్తోంది ఆర్‌సీబీ. ఇది మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేస్తోందని వాపోతున్నారు కోహ్లీ ఫ్యాన్స్..