సచిన్ కంటే వినోద్ కాంబ్లీకి బెటర్ స్టార్ట్ దక్కింది, శుబ్‌మన్ గిల్ అలా కాకుండా... కపిల్ దేవ్ హెచ్చరిక...
శుబ్‌మన్ గిల్ కెరీర్ గ్రాఫ్‌ని చూసుకుంటే 2023కి ముందు ఒక లెక్క, 2023 నుంచి ఓ లెక్క అనాలేమో. 2023 జనవరి నుంచి ఫార్మాట్లతో సంబంధం లేకుండా, పిచ్‌లను పట్టించుకోకుండా పరుగుల ప్రవాహం క్రియేట్ చేస్తున్నాడు శుబ్‌మన్ గిల్...
Image credit: Getty
అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీ బాది, ఇషాన్ కిషన్ ప్లేస్‌కి ఎసరు పెట్టిన శుబ్‌మన్ గిల్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ చేసి... కెఎల్ రాహుల్ ప్లేస్‌కి కూడా చెక్ పెట్టేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి తలుపులు మూసేశాడు...
PTI Photo/Kunal Patil) (PTI05_26_2023_000255B)
ఐపీఎల్ 2023 సీజన్‌లో గత 4 మ్యాచుల్లో మూడు సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, ప్లేఆఫ్స్ బెర్తులను డిసైడ్ చేశాడు. ఆర్‌సీబీని ఓడించి ముంబై ఇండియన్స్‌ని ప్లేఆఫ్స్‌లోకి రప్పించిన శుబ్‌మన్ గిల్, రెండో క్వాలిఫైయర్‌లో అదే టీమ్‌పై అద్బుత సెంచరీ సాధించి... ప్లేఆఫ్సకి రప్పించిన టీమ్‌నే, ఎలిమినేట్ కూడా చేసేశాడు...
శుబ్‌మన్ గిల్ పరుగుల ప్రవాహం క్రియేట్ చేస్తుండడంతో అతన్ని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలతో పోలుస్తున్నారు అభిమానులు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం శుబ్‌మన్ గిల్ ఇంకా వారి స్థాయికి చేరలేదని అంటున్నాడు..
‘సునీల్ గవాస్కర్ వచ్చారు, సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ... ఇలా మంది వచ్చారు, భారత క్రికెట్‌తో పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలారు..
శుబ్‌మన్ గిల్ చూపిస్తున్న బ్యాటింగ్ చూస్తుంటే వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడని అనిపిస్తోంది. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అయితే ఇప్పుడే లెజెండ్స్ పోల్చడం తొందరపాటు అవుతుంది..
Image credit: PTI
అతను ఈ ఆట ఒకే సీజన్‌లో చూపించాడు. ఇలా ఎన్నో సీజన్లు ఆడాడు. టీమిండియాకి ఎన్నో ఏళ్లు ఆడాలి. అప్పుడే మరో గవాస్కర్, సచిన్, కోహ్లీ తర్వాతి ప్లేస్ అతనికి దక్కుతుంది. అతని బలం ఏంటి, బలహీనత ఏంటనేది ఒకటి రెండు సీజన్లతో తెలిసిపోతుంది..
బౌలర్లపై మూడు నాలుగు సీజన్ల పాటు ఆధిపత్యం చూపించి, అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేసినప్పుడే నువ్వు నిజంగా గొప్ప బ్యాటర్‌వి అవుతావు. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు, పరుగులు చేస్తున్నాడు..
Image credit: PTI
ఒక్క సారి ఫామ్ కోల్పోయాక ఎలా రీఎంట్రీ ఇస్తాడు? సూర్యకుమార్ యాదవ్‌ని చూడండి. అతను ఐపీఎల్ సీజన్‌కి ముందు మూడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యాడు. సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అలాంటి కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడే ప్లేయర్ల గొప్పతనం అర్థమవుతుంది..
నన్ను తప్పుగా అనుకోకపోతే నేను ఓ విషయం చెబుతా. సచిన్ టెండూల్కర్ కంటే వినోద్ కాంబ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఆరంభం దక్కింది. అయితే అతను దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు.
Image credit: PTI
ఇప్పుడు ఇంత చిన్న వయసులో శుబ్‌మన్ గిల్‌కి వచ్చిన ఈ క్రేజ్, పాపులారిటీ, బాధ్యత, అంచనాలు అన్నీ అతని ఆటను ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడాలి. వీటిని దాటి అతను సక్సెస్ అయితే లెజెండ్స్ లిస్టులో చేరతాడు...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...