- Home
- Sports
- Cricket
- అవును, కావాలనే నెమ్మదిగా ఆడా! వాళ్లకి గేమ్ తెలీదు... సైమన్ ధుల్‌కి విరాట్ కోహ్లీ రివర్స్ కౌంటర్...
అవును, కావాలనే నెమ్మదిగా ఆడా! వాళ్లకి గేమ్ తెలీదు... సైమన్ ధుల్‌కి విరాట్ కోహ్లీ రివర్స్ కౌంటర్...
ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘనంగా ఆరంభించిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

(PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000179B)
మొదటి 25 బంతుల్లో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 19 బంతుల్లో 19 పరుగులే చేశాడన్నమాట.. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు రవి భిష్ణోయ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించని విరాట్ కోహ్లీ, 42 రన్స్ చేరుకున్నాక మరో 8 పరుగులు చేయడానికి 10 బంతులు వాడుకున్నాడు..
PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000192B)
ఈ ఇన్నింగ్స్ సమయంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ‘ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బుల్లెట్ ట్రైన్‌లా ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఆ తర్వాత ఏమైందో కానీ ఎడ్ల బండిలా నెమ్మది అయిపోయాడు. ఆరంభంలో చాలా షాట్లు ఆడిన విరాట్ కోహ్లీ, 42 పరుగుల నుంచి 50 పరుగుల మార్కు అందుకోవడానికి 10 బంతులు వాడుకున్నాడు...
హాఫ్ సెంచరీ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? అతని హాఫ్ సెంచరీ టీమ్‌ని గెలిపించేలా ఉండాలా? లేక ఓడించేలానా? చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. చాలా ఓవర్లు ఉన్నప్పుడు ఎక్కడా నెమ్మదిగా ఆడాల్సిన అవసరం లేదు. అదే స్పీడ్‌ని కొనసాగించాలి... విరాట్ కోహ్లీకి ఇది తెలియదా?’ అంటూ కామెంట్ చేశాడు కామెంటేటర్ సైమన్ ధుల్..
Image credit: PTI
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు విరాట్ కోహ్లీ. ‘అవును, నేను హాఫ్ సెంచరీకి ముందు కాస్త నెమ్మదిగా ఆడాను. అయితే అది నా హాఫ్ సెంచరీ కోసం కాదు. కొన్నిసార్లు యాంకరింగ్ రోల్ కూడా చాలా అవసరం. పవర్ ప్లే ముగిసిన తర్వాత స్ట్రైయిక్ రొటేట్ చేయడం చాలా అవసరం..
Virat Kohli
ఎందుకంటే పవర్ ప్లే ముగిసిన తర్వాత ఏ టీమ్ అయినా బెస్ట్ స్పిన్నర్లను తీసుకొస్తుంది. వాళ్లకి కాస్త గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యమే. పవర్ ప్లేలో వికెట్ పడకపోతే, భాగస్వామ్యాన్ని పెంచుతూ పోవడం చాలా అవసరం. అందుకే ఓ రెండు ఓవర్లు యాంకరింగ్ రోల్ పోషిస్తే, ఏం చేయాలో ఎలా ఆడాలో క్లారిటీ వస్తుంది..
Image credit: PTI
బయటి నుంచి చూసేవాళ్లకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. వాళ్లు ఎప్పుడూ ఇలాంటి రోల్ పోషించి ఉండకపోవచ్చు. చేతిలో వికెట్లు ఉన్నప్పుడు భారీ షాట్లు ఆడడమే కాదు, వెంటవెంటనే వికెట్ల పడి స్కోరు పడిపోకుండా చూసుకోవడం కూడా మా బాధ్యతే...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..