- Home
- Sports
- Cricket
- బాత్రూమ్‌లో కలిసి బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు... సూర్యకుమార్ యాదవ్ మాటలకు షాకైన ముంబై కోచ్...
బాత్రూమ్‌లో కలిసి బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు... సూర్యకుమార్ యాదవ్ మాటలకు షాకైన ముంబై కోచ్...
సూర్యకుమార్ యాదవ్ టైం ఇప్పుడు అస్సలు బాగోలేదు. టీ20ల్లో సంచలన ప్రదర్శనతో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ సూర్య నుంచి టీమ్ ఆశించిన పర్ఫామెన్స్ ఇంకా రాలేదు...

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 3 మ్యాచుల్లో కలిసి 16 పరుగులు చేసిన సూర్య, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ ఇచ్చిన రెండు క్యాచులను అందుకోవడంలో విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్. అందులో ఓ షాట్, నేరుగా వచ్చి సూర్య కుడి కంటికి పైన భాగంలో తగిలింది. నొప్పితో విలవిలలాడిన సూర్యకుమార్ యాదవ్, తిరిగి బ్యాటింగ్‌కి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
‘సూర్యకుమార్ యాదవ్‌కి గాయమైన తర్వాత ఫిజియో సాయంతో పెవిలియన్‌కి వచ్చాడు. అతని కుడి కన్నుకి పెద్దగా వాపు వచ్చేసింది. దానికి ఐస్ పెట్టి, నిలబడ్డాడు. నొప్పితో బాధపడుతున్నాడు. అతని పొజిషన్ చూసి సూర్యను బ్యాటింగ్‌కి పంపకపోవడమే బెటర్ అని అనుకున్నా...
మరి అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి జరుపుదామని అనుకున్నాం. అయితే అతను నన్ను బాత్రూమ్‌లో కలిశాడు. తన గాయానికి ఐస్ పెట్టుకుంటూ నన్ను చూసి... ‘కోచ్, నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్తా...’ అని చెప్పాడు. అతని మాటలకు నేను షాక్ అయ్యా...
అతను దేనికి భయపడడం లేదు. అంత గాయం అయ్యి, కన్ను మూసుకుపోతున్నా కూడా బ్యాటింగ్ చేయాలని కోరుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి ప్లేయర్లు కావాలి. వీళ్లు మిగిలిన ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతారు. పరిస్థితి బాగోలేకున్నా, టైం కలిసి రాకున్నా దాచుకోవడానికి ఇష్టపడరు..
Image credit: PTI
అంత గాయమైన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ వెళ్లి బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. అతను ఎన్ని పరుగులు చేశాడనేది మాకు విషయమే కాదు, ఎందుకంటే సూర్య చూపించిన తెగువ వెలకట్టలేనిది...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్...