- Home
- Sports
- Cricket
- గోల్డెన్ డక్ డే... అదే రోజు, అదే రిజల్ట్! విరాట్ కోహ్లీకి అస్సలు కలిసిరాని ఏప్రిల్ 23...
గోల్డెన్ డక్ డే... అదే రోజు, అదే రిజల్ట్! విరాట్ కోహ్లీకి అస్సలు కలిసిరాని ఏప్రిల్ 23...
ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ 405 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉంటే 279 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ 3లో ఉన్నాడు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ కప్పు ఎలాగూ గెలవదు, కనీసం ఆరెంజ్ క్యాప్ అయినా గెలవాలని గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్టుగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో దుమ్మురేపుతూ, స్పిన్నర్ల బౌలింగ్‌లో సింగిల్స్ తీస్తూ ఇప్పటికే 4 హాఫ్ సెంచరీలు చేశాడు
kohli out
అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది ఏడో గోల్డెన్ డకౌట్.. రషీద్ ఖాన్ 10 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యి టాప్‌లో ఉంటే, సునీల్ నరైన్, హర్భజన్ సింగ్‌లతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
అయితే యాదృచ్ఛికంగా ఏప్రిల్ 23న జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం విశేషం. 2017 ఏప్రిల్ 23న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌంటర్‌నైల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
Image credit: PTI
ఇది జరిగిన ఐదేళ్లకు 2022 ఏప్రిల్ 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 68 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 9 వికెట్ల తేడాతో ఓడింది...
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000347B)
సరిగ్గా ఏడాదికి 2023, ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ... ప్రత్యర్థి టీమ్స్ మారినా, విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అవ్వడం మాత్రం మారలేదు.. అంతకుముందు 2013లో క్రిస్ గేల్ 175 పరుగులు చేసిన ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
డేట్ మాత్రమే కాదు, గ్రీన్ జెర్సీలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ కావడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో బరిలో దిగిన విరాట్ కోహ్లీ, జగదీశ సుచిత్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు..