రోహిత్ శర్మ ఇక ఆడడం ఆపేస్తే బెటర్! డైరెక్ట్‌గా... సునీల్ గవాస్కర్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ నిలకడైన ఫామ్‌ని కొనసాగించలేకపోతున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 బంతులు ఆడి 1 పరుగుకే అవుటైన రోహిత్ శర్మ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతులు ఫేస్ చేసి 2 పరుగులే చేసి అవుట్ అయ్యాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఐదో సారి టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ ఛాన్స్ మిస్ అయిన ముంబై, 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది...
రెండు సీజన్లలో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్ 2023 సీజన్‌లో బ్యాటర్‌గానూ, కెప్టెన్‌గానూ పెద్దగా మెప్పించలేకపోతున్నాడు. 7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్ తరుపున ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ...
Image credit: PTI
‘నా అభిప్రాయం ప్రకారం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా మార్పులు అవసరం. రోహిత్ శర్మ ఇక ఐపీఎల్‌లో ఆడడం మానేస్తే బెటర్. అంటే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది కాబట్టి అతను ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో ఆడకుండా ఫామ్ రాబట్టుకోవడంపై ఫోకస్ పెట్టాలి...
అవసరం అనుకుంటే ముంబై ఇండియన్స్ ఆడే ఆఖరి మ్యాచుల్లో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వాలి. బిజీ షెడ్యూల్ కారణంగా టీమిండియాకి ఆడే మ్యాచుల్లో రెస్ట్ తీసుకుంటున్న రోహిత్, ఐపీఎల్‌లో వరుసగా మ్యాచులు ఆడడం వల్ల అలిసిపోయినట్టు ఫీల్ అవుతుండొచ్చు.. అతనికి ఇప్పుడు బ్రేక్ చాలా అవసరం...
Image credit: PTI
రోహిత్ శర్మ బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఆలోచిస్తేనే బెటర్. ముంబై ఇండియన్స్ ఇప్పటికే మొమెంటం కోల్పోయింది. ఇప్పుడు ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరేది కష్టమే. కాబట్ట రెస్ట్ తీసుకుని ఆఖరి 3, నాలుగు మ్యాచుల్లోఆడితే అతనికి, టీమ్‌కి మంచిది...
Image credit: PTI
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే అద్భుతం జరగాల్సిందే. ఇప్పుడు టాప్ 4లో లీగ్ స్టేజీని ముగించాలంటే బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అసాధారణంగా రాణించాల్సిందే... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...