- Home
- Sports
- Cricket
- డి కాక్ లాంటి బ్యాటర్‌ని పెట్టుకుని, ఆడించని లక్నో... జాసన్ హోల్డర్‌ని పెట్టుకుని, అశ్విన్‌ని పంపిన...
డి కాక్ లాంటి బ్యాటర్‌ని పెట్టుకుని, ఆడించని లక్నో... జాసన్ హోల్డర్‌ని పెట్టుకుని, అశ్విన్‌ని పంపిన...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్‌గా అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. మొదటి 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఆర్ఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పోరాడి ఓడింది...

రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన ఆర్‌సీబీ, ఇంకా ఐదో స్థానంలో ఉంటే... బెంగళూరు చేతుల్లో ఓడిన ఆర్ఆర్, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టాప్‌లోనే ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి 13 బంతుల్లో 32 పరుగులు కావాల్సిన దశలో రవిచంద్రన్ అశ్విన్‌ని బ్యాటింగ్‌కి పంపింది రాజస్థాన్ రాయల్స్...
PTI Photo)(PTI04_05_2023_000334B)
ఓ వైపు యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ అదరగొడుతుంటే మరో ఎండ్‌లో అశ్విన్‌ని బ్యాటింగ్‌కి పంపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అశ్విన్‌కి సుదీర్ఘ అనుభవం ఉంది. అప్పుడప్పుడు భారీ షాట్లు ఆడగలడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌లో జాసన్ హోల్డర్ రూపంలో ఓ భారీ హిట్టర్ ఉన్నాడు...
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు జాసన్ హోల్డర్. అలవోకగా భారీ సిక్సర్లు కొట్టగల జాసన్ హోల్డర్‌ని బ్యాటింగ్‌కి పంపకుండా అశ్విన్‌కి క్రీజులోకి పంపడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ వైపు జురెల్‌కి తోడు మరో ఎండ్‌లో హోల్డర్ దిగి ఉంటే... రాయల్స్ ఈజీగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి...
జాసన్ హోల్డర్ బ్యాటింగ్‌పై సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టకపోవడం ఓ ఎత్తు అయితే లక్నో సూపర్ జెయింట్స్, క్వింటన్ డి కాక్ విషయంలో వ్యవహరిస్తున్న విధానం మరో ఎత్తు...
Image credit: PTI
గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓపెనర్‌గా వ్యవహరించిన క్వింటన్ డి కాక్, సౌతాఫ్రికా సిరీస్ కారణంగా కాస్త ఆలస్యంగా ఐపీఎల్‌కి వచ్చాడు. దీంతో అతని ప్లేస్‌లో కైల్ మేయర్స్‌ని ఆడించింది లక్నో. ఆరంభ మ్యాచుల్లో 180+ స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టిన కైల్ మేయర్స్, ఇప్పుడు 120-150 స్ట్రైయిక్ రేటుతో ఆడుతున్నాడు...
Image Credit: PTI
క్వింటన్ డి కాక్‌కి ఐపీఎల్‌లో 2764 పరుగులు ఉన్నాయి. 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున 508 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 బంతుల్లో 140 పరుగులు చేసి సెంచరీ కూడా బాదాడు...
క్వింటన్ డి కాక్ లాంటి బ్యాటర్ ఉండి ఉంటే ముంబై ఇండియన్స్ టీమ్ పొజిషన్ మరోలా ఉండి ఉండేది. అలాంటి బ్యాటర్‌ని టీమ్‌లో పెట్టుకుని కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మెంటర్ గౌతమ్ గంభీర్...
Image credit: PTI
ఇప్పటికే సగం సీజన్ ముగిసింది. మరి ఇకనైనా క్వింటన్ డి కాక్‌కి మిగిలిన మ్యాచుల్లో అవకాశం దక్కుతుందా? లేదా? కెఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఇంకా ఆలస్యమైతే అతన్ని ఆడించినా పెద్దగా ప్రయోజం ఉండకపోవచ్చు.