- Home
- Sports
- Cricket
- శుబ్‌మన్ గిల్ కాదు, గుజరాత్ టైటాన్స్‌లో నేనెక్కువ నమ్మేది అతన్నే... - హార్ధిక్ పాండ్యా...
శుబ్‌మన్ గిల్ కాదు, గుజరాత్ టైటాన్స్‌లో నేనెక్కువ నమ్మేది అతన్నే... - హార్ధిక్ పాండ్యా...
ఐపీఎల్ 2022 సీజన్‌ని ఎలాంటి అంచనాలు లేకుండా ఆరంభించి, ఆరంగ్రేటం సీజన్‌లోనే టైటిల్ గెలిచింది గుజరాత్ టైటాన్స్. అది ఏదో గాలివాటుకి వచ్చింది కాదని నిరూపిస్తూ వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్‌కి దూసుకెళ్లింది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 సెంచరీలతో దుమ్మురేపిన శుబ్‌మన్ గిల్, 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 4 ప్లేయర్లు, ఇప్పటికే లీగ్ నుంచి తప్పుకోవడంతో శుబ్‌మన్ గిల్‌కే అది దక్కడం కన్ఫార్మ్...
(PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000232B)
గత నాలుగు మ్యాచుల్లో 3 సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్ కంటే తనకు టీమ్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అంటేనే ఎక్కువ నమ్మకం అంటున్నాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
PTI Photo/Kunal Patil) (PTI05_26_2023_000255B)
‘శుబ్‌మన్ గిల్‌కి సెంచరీలు చేయడం బాగా అలవాటు అయిపోయింది. అతను ఏ మాత్రం కష్టపడడం లేదు. ఓ టీ తాగినట్టుగా తనపైకి వేసిన బాల్స్‌ని బౌండరీ అవతల పడేస్తూ ఈజీగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు...
అతను ఇప్పుడు సూపర్ స్టార్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కానీ ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కానీ శుబ్‌మన్ గిల్‌కి తిరుగే లేదు. అతనికి తన ఆట గురించి పూర్తి క్లారిటీ ఉంది, అంతకుమించి ఆత్మవిశ్వాసం ఉంది. అతని ఆటను చూస్తుంటే ముచ్చటేస్తుంది..
Mumbai: Gujarat Titans bowler Rashid Khan celebrates with teammates after the wicket of Mumbai Indians batter Ishan Kishan during the IPL 2023 cricket match between Gujarat Titans and Mumbai Indians, at Wankhede Stadium in Mumbai, Friday, May 12, 2023. (PTI Photo/Kunal Patil)(PTI05_12_2023_000262B)
రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఏం చెబుతాం. అతని గురించి ఎంత పొగిడినా తక్కువే. నా టీమ్‌లో నేను ఎక్కువగా నమ్మే మొదటి వ్యక్తి అతనే. టీమ్ ఆపదలో ఉన్నప్పుడు ముందుగా రషీద్ ఖాన్ వైపే చూస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..