- Home
- Sports
- Cricket
- ఇందులో కొత్తేముంది.. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేయడం ముంబైకి అలవాటేగా.. పదేండ్ల నుంచి ఇదే కథ..
ఇందులో కొత్తేముంది.. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేయడం ముంబైకి అలవాటేగా.. పదేండ్ల నుంచి ఇదే కథ..
IPL 2023: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. అయితే ఇందులో ముంబై ఫ్యాన్స్ చింతించాల్సిన పనే లేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకూ మరే టీమ్ కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్. గత సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు (10) స్థానానికి పడిపోయిన ఆ జట్టు ఈ ఏడాది కూడా తమ ట్రోఫీ వేటను ఓటమితోనే ప్రారంభించింది.
ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓడటం ముంబైకి ఇదేం కొత్త కాదు. గత పదేండ్లుగా ఆ జట్టుకు ఇది అలవాటే. 2013 నుంచి ఆ జట్టు ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ ను గెలవలేదు. ఫస్ట్ మ్యాచ్ ను దేవుడికి ఇచ్చేయడం వాళ్లకు అలవాటే. నమ్మడం లేదా..? కానీ గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది.
Jasprit Bumrah
2013 లో ముంబై ఇండియన్స్.. ఇదే బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో ఓడింది. కానీ ఈ ఏడాది ముంబై.. తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. 2014, 2015లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడి ఓడింది. 2015 లో కూడా ముంబైదే ఐపీఎల్ ట్రోఫీ..
2016లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఏడాది కూడా ముంబైనే ఐపీఎల్ సీజన్ విన్నర్. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో ఓడిన ముంబై.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 37 పరుగుల తేడాతో ఓడింది. కానీ 2019లో కూడా ముంబైనే విజేత.
ఇక 2020లో చెన్నై సూపర్ కింగద్స్ తో మ్యాచ్ లోనూ ముంబై.. ఐదు వికెట్ల తేడాతో ఓడింది. ఈ సీజన్ లో విజేత కూడా రోహిత్ సేననే. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఏడాది కూడా ట్రోఫీ వాళ్లనే వరించింది.
2022 సీజన్ లో ముంబై.. ఢిల్లీతో బ్రబోర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లోనూ ముంబైకి ఓటమి తప్పలేదు. ఇక నిన్న ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలోనూ ముంబై ఫలితం మారలేదు.
అయితే 2013 కు ముందు ముంబై.. 2009, 2010, 2011, 2012 సీజన్లలో తాము ఆడిన తొలి మ్యాచ్ లను గెలిచారు. కానీ ఈ సీజన్లలో ఆ జట్టు ట్రోఫీ కొట్టలేకపోయింది. మరి వరుసగా పదేండ్ల పాటు ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఓడుతున్న ముంబై.. ఈ సీజన్ లో 2013, 2015, 2017, 2019, 2020 మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా..?