- Home
- Sports
- Cricket
- ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లు వేసిన మహ్మద్ సిరాజ్... రీస్ తోప్లేకి తీవ్ర గాయం! సీజన్ నుంచే తప్పుకునే...
ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లు వేసిన మహ్మద్ సిరాజ్... రీస్ తోప్లేకి తీవ్ర గాయం! సీజన్ నుంచే తప్పుకునే...
టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత కూడా 170+ పరుగులు చేయగల చరిత్ర ముంబై ఇండియన్స్‌కి సొంతం. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబైలో మిస్ అయ్యింది ఇదే. అయితే ఒక్క సీజన్ తర్వాత మళ్లీ ముంబై పాత రూట్‌లోకి వచ్చేసింది...

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, 10 ఓవర్లు ముగిసే సమయానికి 60 పరుగులు కూడా చేయలేకపోయిన ముంబై ఇండియన్స్, చివరి 10 ఓవర్లలో 110 పరుగులకు పైగా రాబట్టింది..
Tilak Varma
జ్వరం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ కెప్టెన్ల ఫోటోషూట్‌కి డుమ్మా కొట్టిన రోహిత్ శర్మ, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బరిలో దిగాడు. అయితే క్రీజులో ఉన్నంత సేపు బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడిన రోహిత్, 10 బంతులాడి 1 పరుగే చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సింగిల్ తీసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 9 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో కర్ణ్ శర్మ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్‌ని ఆపేందుకు డైవ్ చేసిన రీస్ తోప్లే గాయపడ్డాడు. నొప్పిని భరించలేకపోయిన తోప్లే, ఫిజియో సాయంతో పెవిలియన్ చేరాడు. రీస్ తోప్లే పక్కటెముక కదిలిందని ఫిజియో తెలియచేశాడు..
మొదటి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి కామెరూన్ గ్రీన్ వికెట్ తీసిన రీస్ తోప్లే, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆర్‌సీబీపై తీవ్ర ప్రభావం పడుతుంది..
Mohammed Siraj
మొదటి 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన మహ్మద్ సిరాజ్, 19వ ఓవర్‌లో వైడ్ల వర్షం కురిపించాడు. వరుసగా 4 వైడ్లు వేసిన సిరాజ్, ఓ బంతి తర్వాత మరో వైడ్ వేశాడు. మొత్తంగా ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లు వేసి చెత్త రికార్డు నెలకొల్పాడు...
(Source: PTI)
19వ ఓవర్‌లో ఏకంగా 5 వైడ్స్‌తో కలిపి 11 బంతులు వేసి 16 పరుగులు సమర్పించాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్ మొదలెట్టిన దాన్ని అర్షద్ ఖాన్ కొనసాగించాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అర్షద్ ఖాన్, వరుసగా 3 వైడ్లు వేశాడు.