- Home
- Sports
- Cricket
- క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా... - ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్...
క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోనీతో కలిసి ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తా... - ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్...
రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. 2021 సీజన్‌లో 600+ పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్ 1 పరుగు తేడాతో ఆరెంజ్ క్యాప్ మిస్ అయ్యాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000388B)
ఐపీఎల్ 2023 సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, 14 మ్యాచుల్లో 56.15 యావరేజ్‌తో 730 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌లతో కలిసి ఏడు సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు ఫాఫ్ డుప్లిసిస్...
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 100కి పైగా మ్యాచులు ఆడిన ఫాఫ్ డుప్లిసిస్, సౌతాఫ్రికా20 లీగ్‌లో సీఎస్‌కే టీమ్ తరుపునే ఆడుతున్నాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండడం నా అదృష్టం...
Image credit: PTI
ధోనీ క్రికెట్ జ్ఞానం, అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఓ ప్లేయర్‌గా చాలామంది కెప్టెన్సీలో ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశా. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్ వంటి కెప్టెన్ల సారథ్యంలో సౌతాఫ్రికాకి ఆడాను. ధోనీతో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశా...
Image credit: PTI
క్రికెట్‌తో పాటు నాకు రాంఛీలోని ధోనీ ఫామ్ హౌజ్ చాలా నచ్చింది. క్రికెట్ ఫీల్డ్‌లో లెజెండరీ స్టేటస్ సంపాదించిన ధోనీ, ఫామ్‌హౌజ్‌లో ట్రాక్టర్ నడుతుండడం చూసి షాక్ అయ్యా. అంత సింపుల్‌గా ఎలా ఉండగలడో అర్థం కాలేదు...
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆయన ఫామ్‌హౌజ్‌లో పనిచేయాలని ఉంది. అందుకు ఆయన ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్లిపోతా... ’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లిసిస్..