- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్‌ని ఆడించేవాళ్లా? పనికి రాడనే పక్కనబెట్టారుగా... బీసీసీఐపై మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్..
కెఎల్ రాహుల్‌ని ఆడించేవాళ్లా? పనికి రాడనే పక్కనబెట్టారుగా... బీసీసీఐపై మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్..
ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్, ఐపీఎల్ 2023 సీజన్‌లోనే హైలైట్! మ్యాచ్ చప్పగా టెస్టు మ్యాచ్‌లా చప్పగా సాగినా మ్యాచ్‌కి ముందు జయ్‌దేవ్ ఉనద్కట్, మ్యాచ్ ఆరంభమయ్యాక కెఎల్ రాహుల్ గాయపడ్డారు. మ్యాచ్ పూర్తయ్యాక కోహ్లీ, నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్ మధ్య మినీ యుద్ధమే జరిగింది..

KL Rahul
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నోపై రాహుల్ లేని ప్రభావం ఎలా పడుతుందనేది చెప్పడం కష్టమే. ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు కెఎల్ రాహుల్...
PTI Photo/Manvender Vashist Lav)(PTI01_17_2023_000200B)
కెఎల్ రాహుల్ ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌గా ఏ ప్లేయర్‌ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, టీమిండియా పిలుపు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని ఆరంగ్రేటం చేయించే సాహసం, బీసీసీఐ చేస్తుందా?
‘కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ కాదు. వన్డే, టీ20లంటే మ్యానేజ్ చేయగలడేమో కానీ టెస్టుల్లో ఐదు రోజల పాటు వికెట్ల వెనకాల కీపింగ్ చేయాలంటే ప్రొఫెషనల్ వికెట్ కీపర్ అయ్యుండాలి. కెఎల్ రాహుల్ ఆ పని చేయలేడు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్నాడని కెఎల్ రాహుల్‌ని టీమ్ నుంచి తప్పించారు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. ఆ తర్వాత పూజారా, కోహ్లీ, రహానే ఉండనే ఉన్నారు. శ్రీకర్ భరత్‌ని వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు..
శ్రీకర్ భరత్‌తో పాటు కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఎంపిక చేసి ఉంటే, అది కచ్ఛితంగా వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా సెలక్ట్ చేయడమే కరెక్ట్ అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అమోల్ మజుందర్..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులు ఆడిన కెఎల్ రాహుల్, వరుసగా విఫలమయ్యాడు. మొదటి టెస్టుకి వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, రెండో టెస్టు సమయానికి అది కూడా కోల్పోయాడు. అతని సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు రావడంతో రాహుల్‌ని తప్పించి, శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా ఆడించింది బీసీసీఐ.
KL Rahul
నాలుగో టెస్టులో సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ సూపర్ సక్సెస్ కావడంతో చివరి రెండు టెస్టుల్లో కెఎల్ రాహుల్, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు..
KS Bharat
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సిరీస్‌లో 4 టెస్టులు ఆడిన తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, 20.20 యావరేజ్‌తో 101 పరుగులు చేశాడు.