- Home
- Sports
- Cricket
- ఎక్కడ మొదలైందో అక్కడే ముగియనున్న ఐపీఎల్ 2023... రవిశాస్త్రికి ముందే ఈ విషయం తెలుసా...
ఎక్కడ మొదలైందో అక్కడే ముగియనున్న ఐపీఎల్ 2023... రవిశాస్త్రికి ముందే ఈ విషయం తెలుసా...
ఐపీఎల్ 2023 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మొదలైన 2023 సీజన్‌కి, 59 రోజుల తర్వాత మళ్లీ అక్కడే ముగింపు కార్డు పడనుంది....
- FB
- TW
- Linkdin
Follow Us
)
యాదృచ్ఛికంగా ఐపీఎల్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో తలబడిన జట్లే, ఫైనల్ మ్యాచ్‌లోనూ తలబడబోతున్నాయి. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడింది...
లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది. సీఎస్‌కే నేరుగా ఫైనల్ చేరగా ముంబై ఇండియన్స్‌ని రెండో క్వాలిఫైయర్‌లో ఓడించిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ ఆడనుంది...
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడానికి కారణమైంది గుజరాత్ టైటాన్స్. అనుకోకుండా ప్లేఆఫ్స్‌కి వచ్చిన ముంబై ఇండియన్స్, ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తు చేసింది...
GT vs CSK
ఇక మళ్లీ మరోసారి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎల్ క్లాసికో ఫైనల్ మ్యాచ్ చూడొచ్చని ఆశపడ్డారు ఐపీఎల్ ఫ్యాన్స్. అయితే ముంబై ప్లేఆఫ్స్‌కి రావడానికి కారణమైన శుబ్‌మన్ గిల్, అదే జట్టుపై అదిరిపోయే సెంచరీ చేసి... రెండో క్వాలిఫైయర్ నుంచి ఇంటిదారి పట్టించాడు...
దీంతో ఓపెనింగ్ మ్యాచ్‌లో తలబడిన జట్లే, ఫైనల్ ఫైట్‌లో పోటీపడబోతున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది...
మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ ‘ఈ కప్పు గురించి ఈ రెండు జట్లు పోటీపడబోతున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 10 జట్లు పోటీపడితే, ఈ రెండు జట్లే ఫైనల్‌కి వస్తాయని రవిశాస్త్రికి ముందే ఎలా తెలిసింది? అని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్...
GT vs CSK
రవిశాస్త్రికి మాట తడబడడం చాలా సహజంగా జరుగుతుంది. రవిశాస్త్రి కామెంటరీలో చేసే తప్పుల గురించి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి కూడా. అయితే తెలిసి చెప్పాడో, తెలియక నాలుక తడబడి చెప్పాడో కానీ సీజన్ ఆరంభంలో శాస్త్రి చెప్పినట్టుగానే సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలబడబోతున్నాయి...
మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌కి ముందు సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌పై మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే క్వాలిఫైయర్‌లో టైటాన్స్‌ని చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో సీఎస్‌కే గెలిస్తే ఐదో టైటిల్ గెలుస్తుంది. గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే వరుసగా రెండో టైటిల్‌ని సొంతం చేసుకుంటుంది.