- Home
- Sports
- Cricket
- కోహ్లీ - గంగూలీ షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించిన రవిశాస్త్రి.. X,Y అంటూ ఆసక్తిరక వ్యాఖ్యలు
కోహ్లీ - గంగూలీ షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించిన రవిశాస్త్రి.. X,Y అంటూ ఆసక్తిరక వ్యాఖ్యలు
IPL 2023: భారత క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ - విరాట్ కోహ్లీల వివాదంపై విరాట్ గురువుగా భావించే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ఐపీఎల్ -16లో భాగంగా ఏప్రిల్ 15న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విముఖత ప్రదర్శించిన విషయం తెలిసిందే. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. ఆ తర్వాత అతడిని కోపంగా చూసిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
ఇది జరిగిన తర్వాత కోహ్లీ.. తన ఇన్‌స్టా ఖాతాలో దాదాను అన్‌ఫాలో చేశాడు. ఆ మరుసటి రోజే నేనేమైనా తక్కువ తిన్నానా..? అని దాదా కూడా కోహ్లీని అన్‌ఫాలో కొట్టాడు. ఈ ఇద్దరి మధ్య గత విబేధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో లో జరిగిన ఓ కార్యక్రమంలో రవిశాస్త్రిని యాంకర్ ఇదే ప్రశ్న అడిగాడు. దీనికి శాస్త్రి స్పందిస్తూ...‘ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. ఒకరు (X) మాజీ సారథి. లెజెండరీ ప్లేయర్. మరొకరు (Y) కూడా టీమిండియా మాజీ కెప్టేనే . అయినా ఇంకా ఆడుతున్నాడు.
ఇప్పుడు సదరు X అనే ఆటగాడు ఓ జట్టును నడిపిస్తున్నాడు Y కూడా తన టీమ్ కోసం బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. మొన్న మ్యాచ్ ముగిశాక ప్లేయర్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంంటుంటే ఈ ఇద్దరూ మాత్రం అలా చేయలేదు. కారణం ఏంటి..?
ఎందుకంటే వారిద్దరూ మాట్లాడాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏం సలహాలిస్తాం. నేనైతే ఈ విషయంలో ఒకటే చెబుతా. నాకున్న రిలేషన్స్ ప్రకారమే మాట్లాడుతా. లేదంటే ఆ విషయాన్ని దాటవేస్తా.. ’ అని కుండబద్దలు కొట్టాడు.
ఎందుకంటే వారిద్దరూ మాట్లాడాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏం సలహాలిస్తాం. నేనైతే ఈ విషయంలో ఒకటే చెబుతా. నాకున్న రిలేషన్స్ ప్రకారమే మాట్లాడుతా. లేదంటే ఆ విషయాన్ని దాటవేస్తా.. ’ అని కుండబద్దలు కొట్టాడు.