- Home
- Sports
- Cricket
- ఆ విషయంలో సీఎస్‌కే సున్నా! ఒక్కరంటే ఒక్కరు కూడా.. అన్‌క్యాప్డ్ ప్లేయర్లనే నమ్ముకున్న పంజాబ్ కింగ్స్...
ఆ విషయంలో సీఎస్‌కే సున్నా! ఒక్కరంటే ఒక్కరు కూడా.. అన్‌క్యాప్డ్ ప్లేయర్లనే నమ్ముకున్న పంజాబ్ కింగ్స్...
ఐపీఎల్ 2023 సీజన్ గ్రూప్ స్టేజ్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ 12వ సారి ప్లేఆఫ్స్ చేరగా ముంబై ఇండియన్స్ పదోసారి ప్లేఆఫ్స్‌కి చేరింది. కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్ చేరాయి...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image credit: PTI
సీనియర్లనే నమ్ముకునే చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి కూడా కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అన్‌క్యాప్డ్ ప్లేయర్ల బ్యాటు నుంచి ఒక్క పరుగు కూడా రాలేదు...
పంజాబ్ కింగ్స్ టీమ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మినహా ఆ టీమ్‌లో అంతర్జాతీయ అనుభవం ఉన్న మరో భారత బ్యాటర్ లేడు. ఆ టీమ్‌లో ప్రభుసిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ, అధర్వ టైడ్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్.. ఇలా అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కలిపి 1255 పరుగులు చేశారు..
Yashasvi Jaiswal
రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి యశస్వి జైస్వాల్, దృవ్ జురెల్ కలిసి 856 పరుగులు చేయగా కేకేఆర్ నుంచి రింకూ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మన్‌దీప్ సింగ్, నారాయణ్ జగదీశన్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కలిసి 589 పరుగులు చేశారు...
Abdul Samad
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, వివ్‌రాంత్ శర్మ, సన్వీర్ సింగ్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ కలిసి 580 పరుగులు చేయగా ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, రాహుల్ వదేరా, విష్ణు వినోద్, రమణ్‌దీప్ సింగ్ కలిసి 574 పరుగులు చేశారు..
Image credit: PTI
గుజరాత్ టైటాన్స్ నుంచి రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహార్, సాయి కిషోర్ కలిసి 417 పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లలిత్ యాదవ్, ప్రియమ్ గార్గ్, ఆమన్ హకీం ఖాన్, రిపల్ పటేల్ కలిసి 372 పరుగులు చేశాడు...
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000420B)
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఆయుష్ బదోనీ, ప్రేరక్ మన్కడ్, యుద్‌వీర్ సింగ్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లు 352 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు...
Anuj Rawat RCB
మహిపాల్ లోమ్రార్, అనుజ్ రావత్, షాబజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైశాఖ్ కలిసి 267 పరుగులే చేశారు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, రాజ్‌వర్థన్ హంగేర్కర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ 2023 సీజన్ ఆడారు..
అయితే తుషార్ దేశ్‌పాండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుదిజట్టులోకి రాగా చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్, మిడిల్ ఆర్డర్ అదరగొట్టడంతో సీఎస్‌కే అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సీజన్‌లో కూడా అన్‌క్యాప్డ్ బ్యాటర్లకు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వలేదు సీఎస్‌కే..