- Home
- Sports
- Cricket
- ఆ రోజు ఏం జరిగింది? ఎందుకలా చేశావ్? నవీన్ వుల్ హక్‌తో గొడవపై కోహ్లీని వివరణ కోరిన బీసీసీఐ!...
ఆ రోజు ఏం జరిగింది? ఎందుకలా చేశావ్? నవీన్ వుల్ హక్‌తో గొడవపై కోహ్లీని వివరణ కోరిన బీసీసీఐ!...
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విపరీత ప్రవర్తనని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా విరాట్ కోహ్లీని బీసీసీఐ కోరినట్టు సమాచారం..

2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, చాలా సీజన్లలో చాలామంది ప్లేయర్లతో గొడవ పడ్డాడు. 2013లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ, పదేళ్లైనా ఈ ఇద్దరితో పాటు ఫ్యాన్స్ కూడా మరిచిపోలేదు.. 2020 సీజన్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ని సెడ్జ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది..
Mayers and Kohli
అయితే ఎప్పుడూ విరాట్ కోహ్లీ ఎవ్వరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. కారణం విరాట్ కోహ్లీ ప్రవర్తన సెడ్జ్ చేయడం వరకే ఉండేది. కానీ నవీన్ వుల్ హక్‌తో జరిగిన గొడవలో విరాట్ కోహ్లీ ప్రవర్తన హద్దు మీరింది..
Virat Kohli-Naveen Ul Haq Fight
విరాట్ కోహ్లీ సెడ్జింగ్‌కి నవీన్ వుల్ హక్ ధీటుగా బదులు ఇవ్వడంతో తట్టుకోలేకపోయిన టీమిండియా మాజీ కెప్టెన్, ‘నువ్వు నా బూటుకి అంటిన మట్టితో సమానం’ అనే అర్థం వచ్చేలా సైగలు చేశాడు. ఇదే ఇప్పుడు అతని తలకు చుట్టుకుంది...
PTI Photo/Shailendra Bhojak) (PTI04_15_2023_000132B)
రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి, టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ... ఈ సంఘటనని చాలా సీరియస్‌గా తీసుకుంది..
gambhir kohli
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్వయంగా నవీన్ వుల్ హక్‌ని కలిసి ఏం జరిగిందో ఆరా తీశాడు.లక్నో ప్లేయర్లు అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్‌తో పాటు ఆ టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్‌లతో కూడా చర్చించిన రాజీవ్ శుక్లా... బోర్డుకి నివేదించాడు..
దీంతో నవీన్ వుల్ హక్‌తో ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో తెలియచేయాల్సిందిగా విరాట్ కోహ్లీని, బీసీసీఐ రాత పూర్వక వివరణ కోరినట్టు సమచారం. ఇప్పటికే విరాట్ కోహ్లీ, బీసీసీఐకి ఈ విషయంపైన రాత పూర్వక వివరణ ఇచ్చాడట.
విరాట్ కోహ్లీ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే అతనిపై వేటు పడే అవకాశం ఉంది. కోహ్లీపై భారత క్రికెట్ బోర్డు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది?
బీసీసీఐ తీసుకునే యాక్షన్, ఐపీఎల్‌కే పరిమితమవుతుందా? లేక ఆ తర్వాత టీమిండియా ఆడే మ్యాచులకు వర్తిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది..