షాక్‌లు.. జలక్‌లు.. దెబ్బ మీద దెబ్బ.. లక్నోకు కష్టాలే కష్టాలు.. మరో పేసర్ దూరం
IPL 2023: ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ రేసులో సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో జోరు చూపించిన లక్నో సూపర్ జెయింట్స్ తర్వాత పట్టాలు తప్పింది. ఆ జట్టుకు వరుస షాకులు తాకుతూనే ఉన్నాయి.

Image credit: PTI
లక్నో సూపర్ జెయింట్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన ఆ జట్టుకు ఈ నెల ఆరంభం నుంచీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే ఉంది. లక్నో - బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ తో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో ఓటమి ఒక్కటే కాలేదు.. లక్నోకు చాలా నష్టం జరిగింది.
ఇదే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇదే మ్యాచ్ కు ముందు భుజానికి గాయమై ఆ జట్టు పేసర్ జయదేవ్ ఉనద్కత్ కూడా ఈ సీజన్ నుంచి దాదాపుగా తప్పుకున్నాడు. ఇక లక్నో - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ - గంభీర్, కోహ్లీ - నవీన్ ఉల్ హక్ వివాదంతో లక్నో పరువు గంగలో కలిసింది.
Image credit: PTI
లక్నో - బెంగళూరు మ్యాచ్ లో ఓటమి తర్వాత ఆ జట్టు చెన్నైతో ఆడిన మ్యాచ్ వర్షార్పణం అయింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో లక్నో 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ షాకులతో ఆ జట్టు ప్లేఆప్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తాకింది. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ కూడా టీమ్ క్యాంప్ ను వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు.
Image credit: PTI
ఈ విషయాన్ని స్వయంగా లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. తన భార్య ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మార్క్ వుడ్ లక్నో క్యాంప్ ను వీడినట్టు వీడియోలో చెప్పాడు. వుడ్ మాట్లాడుతూ.. నా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జట్టును వీడుతున్నందుకు బాధగానే ఉన్నా ఓ మంచి కారణంతోనే నేను వెళ్తున్నా. నేను తిరిగి జట్టుతో చేరతాననే అనుకుంటున్నా..
Image credit: PTI
ఈ సీజన్ లో నేను నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడినందుకు సారీ కూడా చెబుతున్నా. నాలుగు మ్యాచ్ లు ఆడినా కొన్ని వికెట్లు తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. లక్నో వంటి ఫ్రాంచైజీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ ఎంతో సపోర్టివ్ గా ఉండేవాళ్లు.. ఈ సీజన్ లో మన జట్టు ప్లేఆఫ్స్ తో పాటు మరింత ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నా..’అని చెప్పాడు.
Image credit: PTI
కాగా ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడిన వుడ్ 11వికెట్లు పడగొట్టాడు. కానీ జ్వరం తర్వాత అతడు తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ నిలకడగా రాణిస్తుండటంతో టీమ్ మేనేజ్మెంట్ అతడి వైపునకే మొగ్గు చూపతున్నది. లక్నో విడుదల చేసిన వీడియో ప్రకారం చూస్తే వుడ్ మళ్లీ ఇండియాకు రావడం కష్టమేనని తెలుస్తున్నది.