- Home
- Sports
- Cricket
- ఇది ఇప్పటి గొడవ కాదా, 2020లో మహ్మద్ అమీర్ వేసిన చిచ్చు... నవీన్ వుల్ హక్‌కి ఆఫ్రిదీ సలహా, ఇంతలో కోహ్లీ...
ఇది ఇప్పటి గొడవ కాదా, 2020లో మహ్మద్ అమీర్ వేసిన చిచ్చు... నవీన్ వుల్ హక్‌కి ఆఫ్రిదీ సలహా, ఇంతలో కోహ్లీ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో బాల్‌తో, బ్యాటుతో పెద్దగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా ట్రెండింగ్‌లో నిలిచాడు ఆఫ్ఘాన్ యంగ్ బౌలర్ నవీన్ వుల్ హక్. దీనికి కారణం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో జరిగిన గొడవే...

బెంగళూరులో లక్నో మ్యాచ్‌ని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్‌ని ఏదో సెడ్జ్ చేశాడు. దానికి ఆఫ్ఘాన్ కుర్ర క్రికెటర్ కూడా దీటుగా స్పందించాడు. దీంతో విరాట్ అహం దెబ్బ తిని, ‘నువ్వు నా కాలి ధూళితో సమానం’ అనే అర్థం వచ్చేలా ఏదో అనడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..
అసలు విరాట్ కోహ్లీ ఎందుకు అలా చేశాడు? అదే అన్నాడా? అనేది ఇంకా తెలియకపోయినా నవీన్ వుల్ హక్ స్పందించిన విధానం హాట్ టాపిక్ అయ్యింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో చేతులు కలిపేందుకు కూడా నిరాకరించిన నవీన్, గౌతమ్ గంభీర్, విరాట్ మధ్య పెద్ద వాగ్వాదం జరగడానికి కారణమయ్యాడు.
అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఈ రచ్చ ఇక్కడ, ఇప్పుడు మొదలైంది కాదు. మూడేళ్ల క్రితం లంక ప్రీమియర్ లీగ్‌లో జరిగిన సంఘటనకు కొనసాగింపు అని తెలుస్తోంది. ఎల్‌పీఎల్ 2020 సీజన్‌లో గాలే గ్లాడియేటర్స్, క్యాండీ టస్కర్స్‌ని ఓడించింది..
Shahid afridi
క్యాండీ టస్కర్స్ తరుపున ఆడిన నవీన్ వుల్ హక్, గాలే గ్లాడియేటర్స్ తరుపున ఆడిన పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్‌తో గొడవకు దిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో షాహిదీ ఆఫ్రిదీ, ఇదే విషయమై నవీన్ వుల్ హక్‌పై సీరియస్ అయ్యాడు..
‘కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే, గేమ్ ఆడండి. బూతులు తిడుతూ గేమ్‌ని ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకోకండి. ఆఫ్ఘాన్ టీమ్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మనం సరిహద్దును పంచుకుంటున్నాం. మన టీమ్ మేట్స్‌తో పాటు ప్రత్యర్థిని కూడా గౌరవించడమే క్రీడా స్ఫూర్తికి నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ...
Virat Kohli-Naveen Ul Haq
దీనికి స్పందించిన నవీన్ వుల్ హక్.. ‘నేను సలహాలు తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే ఎవరైనా నన్ను నువ్వు నా కాలి దూళితో సమానం అంటే అది నన్ను మాత్రమే అవమానించినట్టు కాదు, నావాళ్లందరినీ అవమానించినట్టు. నేను దాన్ని ఏ మాత్రం సహించను..’ అంటూ రిప్లై ఇచ్చాడు..
Kohli vs Mishra and Naveen
2020 ఆగస్టులో వేసిన ఈ ట్వీట్‌లో ఉన్నదే, 2023 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత కూడా కామెంట్ చేశాడు నవీన్ వుల్ హక్. ఈ గొడవ తర్వాత నవీన్ వుల్ హక్ సోషల్ మీడియా అకౌంట్లపై విరాట్ ఫ్యాన్స్ తిట్లతో దాడి చేస్తున్నారు. దీంతో అతను కామెంట్లను డిసేబుల్ చేసేశాడు..