- Home
- Sports
- Cricket
- అతనున్న చోటుకి పంపించి వెతకండి, అలాంటి వాళ్లు దొరకొచ్చు... ఉమ్రాన్ మాలిక్‌పై హర్షా భోగ్లే ట్వీట్...
అతనున్న చోటుకి పంపించి వెతకండి, అలాంటి వాళ్లు దొరకొచ్చు... ఉమ్రాన్ మాలిక్‌పై హర్షా భోగ్లే ట్వీట్...
ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి, 2022 సీజన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్. సగటున 150కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్, మ్యాచులు గడిచేకొద్దే వికెట్ల వేటలోనూ దూసుకుపోతున్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో మెరుపు బౌలింగ్ చేసినా, వికెట్లు తీయలేకపోయిన ఉమ్రాన్ మాలిక్... కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి మొట్టమొదటి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసినా ఒకే వికెట్ తీసిన ఉమ్రాన్ మాలిక్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చి.. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని మెప్పించాడు...
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ హైదారాబాద్ మిగిలిన బౌలర్లు ఎవ్వరూ ఒక్క వికెట్ తీయలేకపోయారు. మాలిక్‌కి మరో బౌలర్ సపోర్ట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది...
8 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చిన ఉమ్రాన్ మాలిక్, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
అంతేకాకుండా ఐపీఎల్ 2022 సీజన్‌లో 5 వికెట్లు తీసిన మొదటి పేసర్‌గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్, ఓడిన టీమ్ తరుపున ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన మొదటి ప్లేయర్‌గానూ నిలిచాడు...
మ్యాచ్ మ్యాచ్‌కీ మరింత మెరుగవుతున్న ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన భారత క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే... ‘జమ్మూకి కొంతమంది టాలెంట్ స్కాట్స్‌ని పంపించండి. అతను వచ్చిన చోట అలాంటివాళ్లు చాలామంది ఉండొచ్చు...’ అంటూ ట్వీట్ చేశాడు...
హర్షా భోగ్లే ట్వీట్‌కి స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్... ‘అక్కడికి కచ్ఛితంగా ఉండి ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఎంట్రీ ఇచ్చిన జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్... పెద్దగా మెప్పించలేకపోయినా అతని రికమెండేషన్‌లో టీమ్‌లోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ స్టార్‌గా మారాడు...