- Home
- Sports
- Cricket
- బాలీవుడ్‌లోకి సచిన్ కూతురు సారా టెండూల్కర్... ఇక ఆ భామలు బ్యాగులు సర్దుకోవాల్సిందే...
బాలీవుడ్‌లోకి సచిన్ కూతురు సారా టెండూల్కర్... ఇక ఆ భామలు బ్యాగులు సర్దుకోవాల్సిందే...
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. లేలేత అందాలతో పాలరాతి శిల్పంలా మెరిసిపోయే సారా టెండూల్కర్, అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది...

తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసిన సారా, సమయం దొరికినప్పుడల్లా విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది...
సారా టెండూల్కర్ అందానికి ముగ్దులైన కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, చాలా రోజుల కిందటే ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు..
అయితే సారా మాత్రం అప్పుడు మెడిసిన్ పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టినట్టు చెప్పేసింది. మెడిసిన్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట సారా టెండూల్కర్...
కొన్నాళ్ల క్రిందట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా టెండూల్కర్‌తో నటనలో అడుగులు వేయించేందుకు ఓ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చాడని సమాచారం...
ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సారా టెండూల్కర్, గ్లామర్ ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తహతహలాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి...
బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ నటించే సినిమా ద్వారా సారా టెండూల్కర్, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో సచిన్, ఈ వార్తలను కొట్టి పారేశాడు...
యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ ప్రేమాయణం నడిపిస్తోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ సారా- శుబ్‌మన్ గిల్ లవ్ స్టోరీ గురించి పెద్ద చర్చే నడిచింది...
Image Credit: Yogen Shah
సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆలియా భట్, సారా ఆలీ ఖాన్, అనన్య పాండే వంటి యంగ్ హీరోయిన్లు బ్యాగులు సర్దుకోవాల్సిందేనని ఇప్పటి నుంచే పోస్టులు చేస్తున్నారు ఆమె అభిమానులు...
గ్లామర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతోనే సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాలో హాట్ హాట్ లుక్స్‌తో ఫోటోలను పోస్టు చేస్తోందని, ఆమె ఆశలు త్వరలోనే తీరబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్..
Sara Tendulkar
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Source: Instagram/ Sara Tendulkar)
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Source: Instagram/ Sara Tendulkar)
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Source: Instagram/ Sara Tendulkar)