- Home
- Sports
- Cricket
- IPL 2022: ఫీల్డ్ లో నేను నెంబర్ వన్ అయినా ఇంట్లో మాత్రం సాక్షి చేతిలో అంతే.. ధోని షాకింగ్ కామెంట్స్
IPL 2022: ఫీల్డ్ లో నేను నెంబర్ వన్ అయినా ఇంట్లో మాత్రం సాక్షి చేతిలో అంతే.. ధోని షాకింగ్ కామెంట్స్
IPL 2022 Live Updates: భారత క్రికెట్ కు రెండు ప్రపంచకప్పులు అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ లో చెన్నైకి నాలుగు ట్రోఫీలు అందించాడు. అయితే ఫీల్డ్ లో ఎంత నెంబర్ వన్ అయినా ఇంటికెళ్తే మాత్రం...

భారత మాజీ సారథి.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనికి ఈ సారి సీజన్ ఎంతో ప్రత్యేకం. ఇదే అతడికి ఆఖరి ఐపీఎల్ సీజన్.
అయితే ఐపీఎల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)... తన ప్రిన్సిపల్ స్పాన్సర్ అయిన ఇండియా సిమెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. తన భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కార్యక్రమంలో భాగంగా ఓ అభిమాని ధోనిని ప్రశ్నిస్తూ.. ‘సార్.. నేనొక వ్యక్తిగత ప్రశ్న అడగొచ్చా..?’ అని అడిగాడు. దీంతో ధోని సమాధానం చెబుతూ.. మీరు ఎప్పుడైనా అడగొచ్చు. అయితే దానికి సమాధానం చెప్పాలా..? లేదా..? అనేదానిని నేను నిర్ణయించుకుంటాను అని చెప్పాడు.
సదరు అభిమాని మరో ప్రశ్న వేస్తూ.. ‘ఈ ఫీల్డ్ లో మీరు నెంబర్ వన్ గా ఉన్నారు. కానీ మరి మీ ఇంటిలో ఎవరు నెంబర్ వన్..?’ అని అడిగాడు.
దానికి ధోని సమాధానం చెబుతూ... ‘మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అక్కడ (ఆడిటోరియంలో) కూర్చున్న వారిలో సగం మంది నవ్వుతూనే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇంట్లో భార్యే కదా నెంబర్ వన్..’ అని ఆన్సర్ ఇచ్చాడు.
దీంతో అక్కడున్న వారంతా ఘొల్లున నవ్వారు. భారత జట్టుకు సారథిగా చేసినా.. ప్రపంచంలో ఉత్తమ కెప్టెన్ గా పేరు సంపాదించినా ధోని కూడా ఇంటికెళ్తే భార్య చాటు భర్తే అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
కామెంట్ల విషయం పక్కనబెడితే ఈ జంట 2010లో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి గారాల పట్టి జీవా ధోని చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సీఎస్కే మ్యాచుల సందర్భంగా జీవా.. రైనా, మోయిన్ అలీ ల పిల్లలతో చేసే అల్లరి చూసేవాళ్లకు ఎంతో ముచ్చటేస్తుంది.