MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దినేశ్ కార్తీక్ మామూలోడు కాదు... టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 జట్టులో ఒకే ఒక్కడు...

దినేశ్ కార్తీక్ మామూలోడు కాదు... టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 జట్టులో ఒకే ఒక్కడు...

దినేశ్ కార్తీక్... ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 37 ఏళ్ల వయసులో దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్. ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు కార్తీక్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 24 2022, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

2004 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌పై వన్డేల్లో, నవంబర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్... టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Dinesh Karthik

Dinesh Karthik

డిసెంబర్ 1, 2006న జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో కలిసి మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది భారత జట్టు. 50 ఓవర్లు, టెస్టు ఫార్మాట్‌కి అలవాటైన క్రికెట్ ఫ్యాన్స్‌కి టీ20 మజాని పరిచయం చేసింది ఈ మ్యాచ్ ద్వారానే...

39
Graeme Smith

Graeme Smith

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌కి గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా ఏబీ డివిల్లియర్స్, అల్బీ మోర్కెల్, హర్షల్ గిబ్స్ వంటి లెజెండరీ ప్లేయర్లు ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు...

49

భారత జట్టు తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి ఓపెనింగ్ చేశారు. సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సచిన్...

59

వీరేంద్ర సెహ్వాగ్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా దినేశ్ మోంగియా 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు... ఎమ్మెస్ ధోనీ డకౌట్ అయ్యాడు...

69

71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా దక్కించుకున్నాడు...

79

ఈ మ్యాచ్‌లో పాల్గొన్న ఇరుజట్లలోని 22 మందిలో దినేశ్ కార్తీక్ ఒక్కడే ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతుండడం విశేషం. భారత జట్టులోని సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, దినేశ్ మోంగియా, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, శ్రీశాంత్... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేసిన విషయం తెలిసిందే..

89

18 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూ వస్తున్న దినేశ్ కార్తీక్, టీమిండియా తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచులు మాత్రమే ఆడగలగడం కొసమెరుపు... 

99

సౌతాఫ్రికాతో జరిగిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, 16 ఏళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికాతో సిరీస్ ద్వారానే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved