- Home
- Sports
- Cricket
- బట్లర్ బాబాయ్ కొడుతున్నాడు! నువ్వు ఎందుకు సెంచరీ చేయట్లేదు... వార్నర్‌ని నిలదీసిన కూతుళ్లు...
బట్లర్ బాబాయ్ కొడుతున్నాడు! నువ్వు ఎందుకు సెంచరీ చేయట్లేదు... వార్నర్‌ని నిలదీసిన కూతుళ్లు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున రెండు ఆరెంజ్ క్యాప్‌లు గెలిచిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఘన విజయాన్ని అందించాడు...
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు డేవిడ్ వార్నర్. ‘నా పిల్లలు, నేను ఎందుకు సెంచరీ చేయట్లేదా? అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు...
జోస్ బట్లర్ సెంచరీలు చేస్తున్నాడు, భారీ సిక్సర్లు కొడుతున్నాడు... నేను ఎందుకు అలా ఆడడం లేదనేది వారి సందేహం...
నేను పాజిటివ్‌గా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. పృథ్వీషాతో కలిసి ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అతను చాలా టాలెంటెడ్ క్రికెటర్.. మరో ఎండ్‌లో షాట్లు ఆడే బ్యాటర్ ఉంటే, ఎలాంటి ఒత్తిడి ఉండదు...
బౌలర్లు అద్భుతంగా రాణించి, సగం పని పూర్తి చేసేశారు. పవర్ ప్లేలోనే సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యాం... ఈ విజయం క్రెడిట్ మొత్తం బౌలర్లదే...
ఆఖరిగా ఒక మాట ఫాం ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మినెంట్...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్...
ఢిల్లీ బౌలర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ రహీమ్‌కి ఓ వికెట్ దక్కింది.