- Home
- Sports
- Cricket
- ఆరెంజ్ క్యాప్ రేసు ఆ ఇద్దరి మధ్యే... రవిశాస్త్రి కామెంట్! విరాట్ కోహ్లీని ఆపలేరని...
ఆరెంజ్ క్యాప్ రేసు ఆ ఇద్దరి మధ్యే... రవిశాస్త్రి కామెంట్! విరాట్ కోహ్లీని ఆపలేరని...
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మధ్య అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నన్ని రోజులు, టీమిండియాలో చక్రం తిప్పాడు విరాట్. రవిశాస్త్రి ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే విరాట్ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది...

ఐపీఎల్ 2021 సీజన్‌తో ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు తెలిపాడు...
ఐపీఎల్ 2022లో సాధారణ బ్యాటర్‌గా బరిలో దిగుతున్న విరాట్ కోహ్లీని ఎవ్వరూ ఆపలేరని, అతను ఈ సారి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తాడని సీజన్ ఆరంభంలో కామెంట్ చేశాడు రవిశాస్త్రి...
అయితే ఫస్టాఫ్‌లో రెండు సార్లు రనౌట్ అయ్యి, రెండు సార్లు గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ, తన ఫ్యాన్స్‌తో పాటు మాజీ కోచ్ రవిశాస్త్రిని కూడా తీవ్రంగా నిరాశపరిచాడు...
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచే ప్లేయర్ కూడా కామెంట్ చేశాడు రవిశాస్త్రి. ‘ఈ సీజన్ ఆరంభానికి ముందు ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారని అడిగినా... నేను కెఎల్ రాహుల్ అని చెప్పేవాడిని...
ఎందుకంటే ఓపెనర్లుగా వచ్చేవాళ్లకి ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కెఎల్ రాహుల్, లేదా జోస్ బట్లర్ మధ్య ఆరెంజ్ క్యాప్ రేసు ఎక్కువగా ఉంటుంది...
కెఎల్ రాహుల్ టెక్నిక్ సూపర్బ్. అతను సాలిడ్ ఆల్‌రౌండ్ గేమ్ ఆడుతున్నాడు. కెఎల్ రాహుల్ దగ్గర క్రికెట్ డిక్చనరీలోని అన్ని షాట్స్ ఉన్నాయి. అతని టెంపర్‌మెంట్ కూడా గొప్పగా ఉంటుంది...
అన్నింటికీ మించి సమయానికి తగ్గట్టుగా తన ఆటతీరుని మలుచుకోగల చాకచక్యం తెలిసిన బ్యాటర్ అతను. కొత్త ఫ్రాంఛైజీని నడిపించే బాధ్యతను తీసుకున్నాక రాహుల్ ఆట మరింత మెరుగైంది... ’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...
లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్, సీజన్‌లో రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయినా 148 స్ట్రైయిక్ రేటుతో 7 మ్యాచుల్లో 368 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు...
సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు...
మరోవైపు ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, 161 స్ట్రైయిక్ రేటుతో ఇప్పటికే 491 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు.