- Home
- Sports
- Cricket
- ‘ఏంటయ్యా! థర్డ్ అంపైర్, కళ్లు కనిపించడం లేదా... ’ దేవ్‌దత్ పడిక్కల్ నాటౌట్ నిర్ణయంపై వివాదం..
‘ఏంటయ్యా! థర్డ్ అంపైర్, కళ్లు కనిపించడం లేదా... ’ దేవ్‌దత్ పడిక్కల్ నాటౌట్ నిర్ణయంపై వివాదం..
ఐపీఎల్ 2021 సీజన్‌లో థర్డ్ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి... కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే...

kl rahul
ఆ మ్యాచ్‌లో బంతి నేలను తాకిందనే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో కెఎల్ రాహుల్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చి వేసింది....
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది... రవిభిష్ణోయ్ వేసిన 8వ ఓవర్‌లో గూగ్లీ ఆడేందుకు ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్, షాట్ మిస్ చేశాడు...
బంతిని అందుకున్న వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ అవుట్‌గా అప్పీల్ చేశాడు. అయితే అంపైర నాటౌట్‌గా ప్రకటించడంతో వెంటనే, డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నాడు...
టీవీ రిప్లైలో బంతి, దేవ్‌దత్ పడిక్కల్ గ్లవ్స్ అంచును తాకుతూ వెళుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా ఫలితాన్ని ప్రకటించాడు...
థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాకైన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, ఫీల్డ్ అంపైర్ దగ్గరికి వెళ్లి, రిప్లైలో స్పైక్ స్పష్టంగా కనిపిస్తోందిగా... నాటౌట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు...
అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని మార్చే అధికారం తనకు లేదని ఫీల్డ్ అంపైర్ సమాధానం చెప్పడం కనిపించింది. ఈ సంఘటనతో థర్డ్ అంపైర్ నిర్ణయాలు, మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి...
ఈ సంఘటనపై స్పందించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్కాట్ స్ట్రైరిస్... ‘ఆ థర్డ్ అంపైర్‌ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించండి... వాట్ ఏ జోక్...’ అంటూ ట్వీట్ చేశాడు...
ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది కాబట్టి సరిపోయింది. అదే స్థానంలో ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ ఉండి ఉంటే, అంపైర్లను కొనేశారని ట్రోల్స్ వచ్చేవంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం ఆర్‌సీబీ, థర్డ్ అంపైర్‌ను కొనేసిందంటూ ట్వీట్లు చేస్తున్నారు...