IPL 2020: ఆ రూల్ ఉండి ఉంటేనా... ఆవేదన వ్యక్తం చేస్తున్న ముంబై ఫ్యాన్స్...
IPL 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య సూపర్ ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్ అభిమానులకు నూటికి వెయ్యి శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన ఈ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఆటతీరు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో రేగిన వివాదం కారణంగా సూపర్ ఓవర్ రూల్స్‌ను మార్చేసింది ఐసీసీ...

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. ఆఖరి బంతికి సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. ఆఖరి బంతికి గప్టిల్ రనౌట్ కావడంతో ‘బౌండరీ కౌంట్’ ఆధారంగా విజేతను నిర్ణయించారు అంపైర్లు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 26 బౌండరీలు ఉండగా, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 17 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. దీంతో 7 బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది.

బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయించడం అన్యాయమని కివీస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో దిగివచ్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే, మరో సూపర్ ఓవర్ ఆడించాలని నిబంధన తీసుకొచ్చింది.

ఈ నిబంధన మార్చిన తర్వాత మొట్టమొదటి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబైదే...

ఒకవేళ నిబంధన మార్చకపోయి ఉంటే... బౌండరీ కౌంట్ ఆధారంగా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి ఉండేది...

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 24 బౌండరీలు ఉండగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేధనలో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 22 బౌండరీలు మాత్రమే బాదారు.

దీంతో 2 బౌండరీలు తక్కువగా ఉన్న కారణంగా కింగ్స్ ఎలెవన్ ఓడిపోయేది. ఈ రూల్ మార్చకపోయి ఉంటే రోహిత్ టీమ్ గెలిచి ఉండేదని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.