టీమిండియా ఇలాగే ఆడితే, మిగిలిన జట్లకు ప్రమాదమే... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...
ఈ మధ్యకాలంలో టీమిండియా పొజిషన్ ఏంటో ఫ్యాన్స్‌కి కూడా అర్థం కావడం లేదు. టీమ్‌లోకి వచ్చిన ప్రతీ ప్లేయర్ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇస్తూ, రిజర్వు బెంచ్‌కి రోజురోజుకీ పెంచేస్తున్నారు. దీనికి తనదైన స్టైల్‌లో స్పందించాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...
ఆస్ట్రేలియా టూర్ నుంచి టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన ప్రతీ ఒక్క ప్లేయర్, అద్భుతమైన ప్రద్శనతో అదరగొట్టారు... ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్, టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు, వన్డే సిరీస్ టైటిల్ కోసం ఆడుతోంది...
మొదటి వన్డేలో ఆరంగ్రేటం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, ఆరంగ్రేటం మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. అలాంటి తొలి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్యా కూడా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, ఆకట్టుకున్నాడు...
‘టీమిండియాలో ఏదైనా మెషిన్ గన్ ఉన్నట్టుంది. రోజుకో బుల్లెట్ లాంటి ప్లేయర్ బయటికి వస్తున్నాడంటే మామూలు విషయం కాదు... వారి రిజర్వు బెంచ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది...
సీనియర్లతో పోటీపడుతూ యువ ఆటగాళ్లు కూడా అదరగొడుతున్నారు. ఎంట్రీ మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన ఇస్తే, జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం తేలికవుతుంది...
ఆరు నెలలుగా భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన అందరూ రాణించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది... మునుపటితో పోలిస్తే టీమిండియా చాలా మెరుగైంది...
వరుసగా మ్యాచులు గెలుస్తున్న టీమిండియా, ఇదే ఆటతీరును కొనసాగిస్తే టీ20 వరల్డ్‌కప్ గెలవడం వారికి చాలా తేలిక... భారత జట్టును ఓడించాలంటే ఏ జట్టు అయినా నూటికి నూరు శాతం కష్టపడాల్సిందే...
మొదటి వన్డే చూసినప్పుడు భారత జట్టు స్కోరు 270 కూడా దాటదని అనుకున్నాను. కానీ కెఎల్ రాహుల్, కృనాల్ నిర్మించిన భాగస్వామ్యం అంతా మార్చేసింది...
కృనాల్ పాండ్యా హిట్టింగ్ చూస్తుంటే... టీమిండియా దగ్గర మెషిన్ గన్ ఉన్నట్టుగా అనిపించింది... బుల్లెట్ లాంటి ప్లేయర్లను తయారుచేయడం అంత తేలిక కాదు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఇంజమామ్ వుల్ హక్...
అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన కామెంట్లపై నెటిజన్లు మరోలా స్పందిస్తున్నారు. కేవలం తన యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసమే ఇంజమామ్, ఇలా టీమిండియా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు..
ఆస్ట్రేలియా టూర్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.