అమీర్ చేసిన పని, పాకిస్తాన్ క్రికెట్ పరువు తీస్తుంది... మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆవేదన...
First Published Dec 26, 2020, 9:03 AM IST
పాకిస్తాన్ క్రికెట్ జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లతో పోటీపడి పరుగులు చేసిన ఇంజమామ్... రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ‘తనను మానసికంగా టార్చర్ చేశారంటూ’ ఆరోపిస్తూ రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్ వివాదంపై స్పందించాడు ఇంజమామ్.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారిస్తున్న తీరుపై చాలా ఏళ్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. టాలెంట్ ఉన్న క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే వాళ్లు ఛాన్సులు వెతుక్కుంటూ విదేశాల బాట పడుతున్నారంటూ ఆరోపించాడు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.

పాక్ క్రికెట్ బోర్డు నుంచి తాను విపరీతమైన మెంటల్ టార్చర్ భరించానని, ఇంకా భరించే ఓపిక లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహ్మద్ అమీర్.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?