సూర్యకుమార్ యాదవ్‌ని టార్గెట్ చేస్తూ మిచెల్ స్టార్క్ బౌన్సర్... ఫామ్‌లో ఉన్న ఒక్కడూ గాయపడ్డాడా!...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు, రవీంద్ర జడేజా రూపంలో మరో మ్యాచ్ విన్నర్ కూడా ఈ మెగా టోర్నీలో పాల్గొనడం లేదు. ఫాస్ట్ బౌలర్ల పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అయినా టీమిండియా ఫ్యాన్స్‌కి ఉన్న ఒకే ఒక్క హోప్ సూర్యకుమార్ యాదవ్...
అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి నిలకడైన ప్రదర్శన ఇస్తూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు చాలా చేరువలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో కొనసాగుతున్నాడు...
అలాంటి సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడా? ఇదే అనుమానం టీమిండియా అభిమానులను కలవరబెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
అయితే అవుట్ అవ్వడానికి ముందు 19వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ వేసిన ఓ రాకాసి బౌన్సర్, సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్‌కి బలంగా తగిలింది. ఫిజియో వచ్చి సూర్యకుమార్ యాదవ్‌ని పరీక్షించిన తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు సూర్య. బౌన్సర్ తగిలిన తర్వాత నాలుగు బంతులు ఆడిన సూర్య భాయ్... రెండు డాల్స్ ఆడి ఓ ఫోర్ కొట్టి ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు...
Image credit: Getty
ఇంతకుముందు 2020 ఆస్ట్రేలియా పర్యటనలో రవీంద్ర జడేజా కూడా ఇలాగే గాయపడ్డాడు. హెల్మెట్‌కి బౌన్సర్ తగిలిన తర్వాత కూడా కొన్ని బంతులు ఆడిన జడ్డూ.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి కూడా రాలేదు. స్కానింగ్‌లో జడ్డూకి తగిలిన గాయం తీవ్రమైనదని తేలడంతో నాలుగు వారాల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...
సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇలా కాకూడదని కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు. అసలే బౌలింగ్ వీక్‌గా ఉంది, ఇప్పుడు సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా దూరమైతే ఇక భారత జట్టుపై ఆశలు వదులుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు...