INDvsAUS: మరోసారి ఆసీస్‌ను ఆదుకున్న టెయిలెండర్లు... భారత విజయ లక్ష్యం 70...
First Published Dec 29, 2020, 7:37 AM IST
99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను టెయిలెండర్లు అద్బుత పోరాటంతో ఆదుకున్నారు. చివరి నాలుగు వికెట్లకు 101 పరుగులు జోడించి... టీమిండియా ముందు లక్ష్యాన్ని అందించారు. ఒకానొక దశలో ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్న దశలో... ఆసీస్ తోక భారత్‌కి ఆ అవకాశం ఇవ్వలేదు. ఓవర్‌నైట్ స్కోరు 133 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 200 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత విజయ లక్ష్యం 70 పరుగులు.

కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్ కలిసి ఏడో వికెట్‌కి 57 పరుగుల అమూల్య భాగస్వామ్యం నెలకొల్పారు... ఈ ఇద్దరినీ విడగొట్టేందుకు తీవ్రంగా శ్రమించింది టీమిండియా...

రెండు సార్లు రివ్యూలు తీసుకున్నా ఫలితం ఆస్ట్రేలియాకే దక్కింది. కొత్త బంతిని తీసుకున్న తర్వాతి ఓవర్‌లోనే తొలి బ్రేక్ అందించాడు జస్ప్రిత్ బుమ్రా...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?