- Home
- Sports
- Cricket
- ఆసియా కప్‌లో 2 మ్యాచులు చూసి, వన్డే వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్‌మెంట్.. ప్రపంచ కప్‌లో భారత జట్టు ఎలా ఉండనుంది!
ఆసియా కప్‌లో 2 మ్యాచులు చూసి, వన్డే వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్‌మెంట్.. ప్రపంచ కప్‌లో భారత జట్టు ఎలా ఉండనుంది!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ హంగామా మొదలైపోయింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్ ఇప్పటికే ప్రపంచ కప్‌కి ప్రాథమిక జట్టును ప్రకటించాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ వంటి ఆసియా జట్లు, ఆసియా కప్ 2023 టోర్నీ పర్ఫామెన్స్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌ని డిసైడ్ చేయబోతున్నాయి...

అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రొవిషనల్ జట్లను ప్రకటించేందుకు సెప్టెంబర్ 5ని డెడ్‌లైన్‌గా ప్రకటించింది ఐసీసీ. భారత క్రికెట్ బోర్డు సరిగ్గా ఇదే రోజున ప్రపంచ కప్ టీమ్‌ని అనౌన్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది..
వాస్తవానికి బీసీసీఐ, సెప్టెంబర్ 3న వన్డే వరల్డ్ కప్ టీమ్‌ని ప్రకటించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 2న జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా సజావుగా జరగడం కష్టమేనని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్ పర్ఫామెన్స్ చూశాకే వన్డే వరల్డ్ కప్ టీమ్‌ని ప్రకటించనుంది బీసీసీఐ..
ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో 90 శాతం ప్లేయర్లు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడడం ఖాయం. ఆసియా కప్ 2023 టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది టీమిండియా. ఇందులో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణలకు వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో చోటు దక్కకపోవచ్చు..
మిగిలిన టీమ్‌లో శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించాలని మాజీ క్రికెటర్లు సలహాలు ఇస్తున్నారు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కాబట్టి లెగ్ స్పిన్నర్ల అవసరం చాలా ఉంటుంది. అక్షర్ పటేల్, వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆసియా కప్‌లో జరిగే మొదటి 2 మ్యాచుల్లో బౌలింగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఎందుకంటే అక్షర్ పటేల్ ఈ మధ్య కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేడు. ఐపీఎల్ 2023 టోర్నీతో పాటు ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లోనూ అటు బ్యాటుతో కానీ, ఇటు బంతితో కానీ రాణించలేకపోయాడు అక్షర్ పటేల్. అయితే స్పిన్ ఆల్‌రౌండర్ అనే కారణంగా అతన్ని ఆసియా కప్ 2023 ఆడిస్తోంది టీమిండియా..
Team India
మొదటి 2 మ్యాచుల్లో అక్షర్ పటేల్ నుంచి సరైన పర్ఫామెన్స్ రాకపోతే అతని స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ని లేదా వాషింగ్టన్ సుందర్‌ని... అతను కూడా కాకపోతే రవిచంద్రన్ అశ్విన్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లోకి తీసుకురావాలని సెలక్టర్లు భావించవచ్చు..
అలాగే కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో కెఎల్ రాహుల్ ఆడడం లేదు. నేపాల్‌తో మ్యాచ్ ముగిసే సమయానికి కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ రాకపోతే సంజూ శాంసన్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
మొత్తానికి రోహిత్, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ వంటి కోర్ టీమ్ ప్లేయర్లు తప్ప.. మిగిలిన ప్లేసుల విషయంలో ఆసియా కప్ 2023 గ్రూప్ మ్యాచులు క్లారిటీ ఇవ్వబోతున్నాయి..
Team India
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టీమిండియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తే), రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్ (ఫామ్ నిరూపించుకుంటే), శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ లేదా సంజూ శాంసన్ (కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే), ఇషాన్ కిషన్