ఆరునూరైనా పాక్‌లో అడుగుపెట్టం! స్పష్టం చేసిన బీసీసీఐ సెక్రటరీ... పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు...
షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా పాల్గొంటుందా? లేదా? ఈ విషయంపై కొన్నాళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కి బీసీసీఐ సెక్రటరీ జై షా తెరదించాడు. పాకిస్తాన్‌లో ఈ టోర్నీ నిర్వహిస్తే అందులో టీమిండియా పాల్గొనడం జరగని పని అంటూ క్లారిటీ ఇచ్చేశాడు జై షా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సింది. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ టోర్నీని నిర్వహించలేమని లంక క్రికెట్ బోర్డు చేతులు ఎత్తేయడంతో యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీని నిర్వహించారు... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరిగింది...
వచ్చే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత జట్టు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ 2023 జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొంటుందా?...
కొన్నాళ్ల క్రితం జరిగిన బీసీసీఐ వార్షిన సాధారణ సమావేశం (AGM)లో ఈ విషయం గురించి కూడా చర్చ సాగింది. పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ సభ్యులు సుముఖత వ్యక్తం చేశారని, అయితే కేంద్రం అనుమతి వస్తే పాకిస్తాన్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపించాయి...
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాక్‌లో అడుగు పెట్టడం జరగదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు...
Sourav Ganguly-Jay shah
‘తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహించాలని ఏషియా క్రికెట్ అసోసియేషన్‌కి సూచించాం. ఎందుకంటే భారత జట్టు, పాకిస్తాన్‌లో పర్యటించడానికి సిద్ధంగా లేదు...’ అంటూ తెలిపాడు జై షా. బీసీసీఐ సెక్రటరీ కామెంట్లతో పాక్‌లో ఆసియా కప్ జరిగితే, భారత జట్టు అందులో పాల్గొనడం జరగదు...
భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించడంతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు జరగాల్సిన ఆసియా కప్‌ని వాయిదా వేశారు. పాక్‌లో పర్యటించేందుకు టీమిండియా ఒప్పుకోకపోతే, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..