- Home
- Sports
- Cricket
- కెప్టెన్సీ వస్తే ఊరుకుంటాడా, అతన్ని ఇంకెవ్వరూ ఆపలేరు... సునీల్ గవాస్కర్ కామెంట్స్...
కెప్టెన్సీ వస్తే ఊరుకుంటాడా, అతన్ని ఇంకెవ్వరూ ఆపలేరు... సునీల్ గవాస్కర్ కామెంట్స్...
టీమిండియాలో ఇప్పుడు లక్కీ ఫెల్లో ఎవరంటే అది కెఎల్ రాహులే... ఆరు నెలల క్రితం టెస్టు టీమ్‌లో చోటు కూడా దక్కించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, ఇప్పుడు ఏకంగా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ, వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గానే ఎంపికయ్యాడు...

వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చిన తర్వాత తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగిపోయాడు కెఎల్ రాహుల్. సెంచూరియన్ టెస్టులో టీమిండియా విజయానికి ఈ సెంచరీ చాలా కీలకంగా మారింది...
తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం కారణంగానే రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్ అయినా, ప్రత్యర్థి ముందు 300+ టార్గెట్ ఉంచి, విజయం సాధించగలిగింది...
19 ఏళ్ల తర్వాత సెంచూరియన్ తొలి టెస్టు విజయంతో ఉత్సాహంతో ఉన్న భారత జట్టు, సఫారీ గడ్డపై మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోవాలనే ఆరాటపడుతోంది...
‘కెఎల్ రాహుల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్. అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆరంగ్రేటం దగ్గర్నుంచి రాహుల్ నిలకడగా పరుగులు సాధిస్తునే ఉన్నాడు..
టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్‌లో సెంచరీ సాధించడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగి ఉంటుంది. ఇప్పుడు సెంచూరియన్ టెస్టు తర్వాత అతని రెట్టింపు ఎనర్జీ పొంది ఉంటాడు...
వన్డేల్లో కెప్టెన్సీ కూడా దక్కడంతో ఇప్పుడు అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. నాకు తెలిసి అతనికపై సెంచరీల వర్షం కురిపించబోతున్నాడు...
ఒకదాని వెంట ఒకటి సెంచరీలు కెఎల్ రాహుల్ బ్యాటు నుంచి వరదల పారుతాయి. టెస్టు సెంచరీ ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు...
సెంచరీ చేసిన తర్వాత జనాల మధ్య, లేదా డ్రెస్సింగ్ రూమ్‌కి బ్యాటు ఎత్తి చూపించడంలో కిక్ వేరేగా ఉంటుంది. ప్రతీ బ్యాట్స్‌మెన్ ఆ మధుర క్షణాలను అనుభవించాలని కోరుకుంటాడు...
ఈ సిరీస్‌లో అతని నుంచి ఒకటి రెండు సెంచరీలు వస్తాయని అయితే నాకు అనిపిస్తోంది, అంత కంటే ఎక్కువ కూడా రావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...