- Home
- Sports
- Cricket
- ఇలాంటి బౌలింగ్ అటాక్ ఉంటే, మేం కూడా ఆడలేం... భారత ఫాస్ట్ బౌలర్లపై విరాట్ కోహ్లీ కామెంట్స్...
ఇలాంటి బౌలింగ్ అటాక్ ఉంటే, మేం కూడా ఆడలేం... భారత ఫాస్ట్ బౌలర్లపై విరాట్ కోహ్లీ కామెంట్స్...
2021 ఏడాదిని సిడ్నీ టెస్టులో చారిత్రక డ్రా, ఆ తర్వాత గబ్బాలో చరిత్రాత్మక విజయంతో ప్రారంభించిన టీమిండియా, సెంచూరియన్‌లో రికార్డు విజయంతో ముగించింది. 33 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆసీస్‌కి పరాజయాన్ని రుచి చూపించిన భారత జట్టు, 19 ఏళ్లలో తొలిసారి సెంచూరియన్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది...

ఈ ఏడాది భారత జట్టు విదేశాల్లో అందుకున్న విజాయల్లో కీలక పాత్ర పోషించారు ఫాస్ట్ బౌలర్లు. మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది 30 టెస్టు వికెట్లతో అదరగొడితే... మహ్మద్ షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ తమ వంతు పాత్ర పోషించారు...
1958 నుంచి సౌతాఫ్రికాని, సౌతాఫ్రికాలో 200 పరుగుల లోపు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అవుట్ కావడం ఇది మూడోసారి. 2002లో ఆసీస్ ఈ ఘనత సాధిస్తే, 2018లో, 2021లో భారత జట్టు... సఫారీ జట్టును చిత్తు చేసింది...
ఈ ఏడాది భారత పేసర్లు 28.12 సగటుతో 128 వికెట్లు తీస్తే, భారత స్పిన్నర్లు 121 వికెట్లు సాధించారు. స్పిన్నర్లు పడగొట్టిన వికెట్లలో 90 శాతానికి పైగా స్వదేశంలో రాగా, విదేశాల్లో పడగొట్టిన వికెట్లలో అగ్రతాంబూలం ఫాస్ట్ బౌలర్లదే..
‘సఫారీ టూర్‌ను విజయంతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన నాలుగు రోజుల్లో విజయం అందుకోగలిగామంటే ఆ క్రెడిట్ మొత్తం బౌలర్లదే...
సౌతాఫ్రికాలో, ముఖ్యంగా సెంచూరియన్‌లో ఆడడం చాలా కష్టం, ఈ పరిస్థితులు భారత బ్యాట్స్‌మెన్‌కి కఠినమైన పరీక్షలాంటివి. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ ఆడిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే...
మొదటి ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో చాలా కంగారుపడ్డాం. బుమ్రా లేకపోవడం వల్ల సౌతాఫ్రికా మరో 40 పరుగులు అదనంగా సాధించగలిగింది...
పరిస్థితులను తమకు తగ్గట్టుగా మలుచుకుని బౌలింగ్ చేస్తున్న భారత పేస్ విభాగాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మహ్మద్ షమీ, వరల్డ్ టాప్ 3 సీమ్ బౌలర్లలో ఒకడిగా ఉంటాడు...
భారత జట్టుకి ఉన్న పేస్ బౌలింగ్‌ను మేం ఎదుర్కోకపోవడం మా అదృష్టమనే చెప్పాలి. ఇలాంటి బౌలింగ్ అటాక్ ఉంటే, మేం కూడా ఏం చేసేవాళ్లం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...