- Home
- Sports
- Cricket
- అతని రీఎంట్రీ మా ఇద్దరికీ ఎనర్జీ బూస్ట్... హార్ధిక్ పాండ్యాపై కుల్దీప్ యాదవ్ కామెంట్...
అతని రీఎంట్రీ మా ఇద్దరికీ ఎనర్జీ బూస్ట్... హార్ధిక్ పాండ్యాపై కుల్దీప్ యాదవ్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా భారత సీనియర్లు తమ పర్ఫామెన్స్‌పై వచ్చిన అనుమానాలపై క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అదిరిపోయే పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇవ్వకపోవడంపై ఎంత రచ్చ జరిగిందో, ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాకి టీమ్‌లో చోటు కల్పించడంపై కూడా అంతే రాద్ధాంతం జరిగింది... ఫిట్‌గా లేనప్పుడు, బౌలింగ్ చేయలేనప్పుడు పాండ్యాని ఎందుకు సెలక్ట్ చేశారనే ట్రోల్స్ వచ్చాయి...
హార్ధిక్ పాండ్యాకి బదులుగా ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌ని సెలక్ట్ చేసి టీమిండియా పొజిషిన్ బెటర్‌గా ఉండేదని కామెంట్లు వినిపించాయి. సెలక్టర్లకు కూడా హార్ధిక్ పాండ్యాని సెలక్ట్ చేయడం ఇష్టం లేదని, అయితే మెంటర్ ఎమ్మెస్ ధోనీ కారణంగానే అతన్ని కొనసాగించాల్సి వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి...
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా, టీమిండియాలోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ, తమకు ఎంత లాభసాటిగా మారుతుందని అంటున్నారు..
Image Credit: Instagram + PTI
‘హార్ధిక్ పాండ్యా నూరు శాతం ఫిట్‌గా ఉండడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అతను ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వెన్ను గాయమైంది, బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు...
బాగా బరువు తగ్గాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత రీఎంట్రీ ఇవ్వాలంటే ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే హార్ధిక్ పాండ్యాకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది...
ఐపీఎల్‌లో అతని పర్ఫామెన్స్ చాలా బాగుంది. కెప్టెన్‌గా మ్యాజిక్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ కొత్త టీమ్, అందులో స్టార్ ప్లేయర్లు కూడా పెద్దగా లేరు. అయితే పాండ్యా ప్రెషర్‌ని హ్యాండిల్ చేస్తూ, టీమ్‌ని నడిపించిన విధానం అద్భుతం...
KL Rahul-Hardik Pandya
జట్టును అద్భుతంగా నడిపించి, టైటిల్ గెలిచాడు. ఈ విజయంలో హార్ధిక్ పాండ్యాకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. పాండ్యా ఫిట్‌గా ఉండడం టీమ్‌కి మాత్రమే కాదు, నాకు, యజ్వేంద్ర చాహాల్‌కి కూడా కలిసొచ్చే విషయం...
ఎందుకంటే బౌలర్లను అర్థం చేసుకునే తత్వం అందరికీ ఉండదు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను ఎలా గైడ్ చేయాలో హార్ధిక్ పాండ్యాకి బాగా తెలుసు. అందుకే పాండ్యా మాకు ఎనర్జీ బూస్ట్ లాంటోడు. అతను తుది జట్టులో ఉండాలని కోరుకుంటున్నా... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్...