అతనిపై ఆ ప్రెషర్ పెట్టకండి... హార్ధిక్ పాండ్యాపై టీమిండియాకి ఆశీష్ నెహ్రా సూచన...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా, బ్యాటర్‌గా, ఫీల్డర్‌గానూ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు హార్ధిక్ పాండ్యా. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, కొన్ని నెలలకే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 15 మ్యాచుల్లో 487 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లోనూ అదరగొట్టి 8 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’గా నిలిచాడు..
KL Rahul-Hardik Pandya
కెఎల్ రాహుల్ గాయపడి, సౌతాఫ్రికాతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో హార్ధిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ దక్కింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో అతని కంటే సూపర్ సీనియర్ హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉన్నాడు, అందులో ఎలాంటి సందేహాలు లేవు. అయితే వెన్నెముక సర్జీరీ అయిన తర్వాత అతనిపై పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయాలని ఒత్తిడి పెట్టడ కరెక్ట్ కాదు...
బ్యాటర్‌గా హార్ధిక్ పాండ్యా అద్భుతంగా రాణించగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టుల్లో కూడా కొన్ని గంటల పాటు నిలబడి బ్యాటింగ్ చేయగలడు. అయితే బౌలింగ్ విషయానికి వచ్చేసరికి టీ20ల్లో కూడా నాలుగు ఓవర్లు పూర్తి చేయాలనే ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదు...
ఇప్పుడున్న జట్టుకి హార్ధిక్ పాండ్యా అవసరం చాలా ఉంది. ఎందుకంటే టాపార్డర్‌లో ఉన్న టాప్ 5 బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు. కాబట్టి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ ఆప్షన్‌గా వాడొచ్చు... ఫిట్‌గా ఉంటే, అతను పూర్తి ఓవర్లు వేస్తాడు...
అయితే ప్రతీ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయమని హార్ధిక్ పాండ్యాపై ఒత్తిడి పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
Hardik Pandya
అతను జట్టులో ఐదో బౌలర్‌గా కాకుండా ఆరో బౌలింగ్ ఆప్షన్‌గానే వాడితే బెటర్...’ అంటూ క్రిక్‌భజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియాకి సూచించాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...