మంచి వికెట్ కీపర్ కావాలంటే ఈ మూడు లక్షణాలు తప్పనిసరి... రిషబ్ పంత్ కామెంట్...
24 ఏళ్ల వయసులో టీమిండియాకి కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కించుకున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సౌతాఫ్రికాపై స్వదేశంలో టీ20 గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన కెప్టెన్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఫ్యూచర్‌పై చాలా ఆశలే రేపుతున్నాడు...

Rishabh Pant
2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రిషబ్ పంత్, నాలుగేళ్లలో మూడు ఫార్మాట్లలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఒకానొక దశలో 2020 ఐపీఎల్‌కి ముందు మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియా టూర్ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో స్టార్ ప్లేయర్‌గా మారాడు...
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. వికెట్ కీపర్‌కి ఉండాల్సిన ముఖ్యమైన మూడు లక్షణాలను బయటపెట్టాడు రిషబ్ పంత్...
Image credit: PTI
‘వికెట్ కీపర్‌కి ఉండాల్సిన ముఖ్య లక్షణం చురుకుదనం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడాల్సి వస్తుందో చెప్పలేం. కాబట్టి పిచ్, వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నా చురుకుదనం ఉంటే వాటిని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు...
Image credit: PTI
వికెట్ కీపర్‌కి ఉండాల్సిన రెండో ప్రధాన లక్షణం... తీక్షణమైన ఏకాగ్రత. బౌలర్ బంతిని చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి గమనిస్తూ ఉండాలి. చివరి క్షణం వరకూ బంతిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అప్పుడే బ్యాట్స్‌మెన్ ఎలా ఆడినా దానికి తగ్గట్టుగా స్పందించే అవకాశం దొరుకుతుంది...
Image credit: PTI
ఇక మూడో లక్షణం క్రమశిక్షణ.. వికెట్ కీపర్ ఎప్పుడూ తన టెక్నిక్స్‌ని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రతీ ఒక్కరికీ ఒక్కో విభిన్నమైన టెక్నిక్ ఉంటుంది. బౌలర్లను, బ్యాటర్ల టెక్నిక్‌ను గమనిస్తుంటే... వికెట్ పడగొట్టడానికి ఏం చేయాలో వారికి సలహా ఇచ్చేందుకు సహాయం చేయొచ్చు...
Image credit: PTI
నేను ప్రతీ గేమ్‌లో నూటికి నూరు శాతం ఇచ్చేందుకే కష్టపడుతున్నా. నేనెప్పుడూ వికెట్ కీపింగ్ బ్యాటర్‌నే. చిన్నప్పటి నుంచి వికెట్ కీపింగ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడిని. మా నాన్న కూడా వికెట్ కీపర్‌యే... ఆయన వికెట్ కీపింగ్‌ని చూస్తూ నాకు ఇది అలవాటు అయిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్..
Rishabh Pant
ప్రారంభంలో క్యాచులు జారవిడుస్తూ, స్టంపౌట్స్ చేయడానికి కష్టపడుతూ విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఇప్పుడు వికెట్ కీపర్‌గానూ రాణిస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పంత్, వికెట్ కీపింగ్‌లో కొన్ని తప్పులు చేసి ట్రోలింగ్ ఎదుర్కోవడం విశేషం...