- Home
- Sports
- Cricket
- ఆ డ్యాన్సులు, విజిల్స్ తగ్గించి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టు... విరాట్ కోహ్లీపై మరోసారి తీవ్రమైన ట్రోలింగ్...
ఆ డ్యాన్సులు, విజిల్స్ తగ్గించి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టు... విరాట్ కోహ్లీపై మరోసారి తీవ్రమైన ట్రోలింగ్...
విరాట్ కోహ్లీ... ఓ రన్ మెషిన్! సెంచరీ చేయడం ఇంత తేలికా... అన్నట్టుగా కెరీర్ ఆరంభం నుంచి జెట్ స్పీడ్‌లో 70 శతకాలు బాదేశాడు విరాట్. అయితే రెండేళ్లుగా రన్ మెషిన్‌కి రిపేర్ అయినట్టుంది... సెంచరీ మార్క్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు విరాట్...

2019 తర్వాత 25 టెస్టు ఇన్నింగ్స్‌లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ... సెంచూరియన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 35, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ మార్కు అందుకోకపోవడం కంటే అతను అవుటైన విధానంపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి...
గాలికి పోయే కంపను కాలికి తగిలించుకున్నట్టుగా... వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడి వికెట్ పారేసుకుంటున్న విరాట్ కోహ్లీపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
సెంచూరియన్ టెస్టులోనే కాకుండా విరాట్ కోహ్లీ ఈ విధంగా ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతులను వెంటాడుతూ వికెట్ పారేసుకోవడం.. చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది...
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో మిగిలిన మ్యాచుల్లోనూ ఈ విధంగానే ఎక్కువ సార్లు అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
ఇన్నిసార్లు ఇలా అవుట్ అవుతున్నా, టెక్నిక్ సరిదిద్దుకోవడంపై విరాట్ కోహ్లీ ఫోకస్ పెట్టకపోవడం... క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
రాహుల్ ద్రావిడ్ వంటి హెడ్ కోచ్ అందుబాటులో ఉన్నప్పుడు, విరాట్ ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు... కానీ కోహ్లీ బ్యాటింగ్ తీరు చూస్తుంటే మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు...
క్రీజులో డ్యాన్సులు వేస్తూ, స్టెప్పులతో మిగిలిన వారిని ఉత్సాహపరుస్తూ సందడి చేసే విరాట్ కోహ్లీ, అప్పుడప్పుడూ విజిల్స్ వేస్తూ జట్టులో జోష్ పెంచుతూ ఉంటాడు...
సెంచూరియన్ టెస్టులోనూ ఇలాంటి స్టెప్పులు వేశాడు విరాట్. ఇవన్నీ తగ్గించి, కాస్త బ్యాటింగ్ టెక్నిక్‌పై ఫోకస్ పెట్టాలని కోహ్లీని కోరుతున్నారు అభిమానులు. కనీసం మిగిలిన రెండు టెస్టుల్లో అయినా సెంచరీ మార్కు అందుకోవాలని అభిలాషిస్తున్నారు...
సచిన్ టెండూల్కర్ 99వ సెంచరీ తర్వాత వందో సెంచరీ అందుకోవడానికి ఓ ఏడాది గ్యాప్ తీసుకుంటేనే అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నూరో టెస్టు కోసం ముసలోడు అయ్యేదాకా ఆడిస్తారా? అంటూ టీమిండియాని ట్రోల్ చేశారు అభిమానులు...
ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు, 71వ సెంచరీని అందుకోవడానికి ఓ రకంగా పురిటి నొప్పులు పడాల్సి వస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...