టీమిండియాకి అతని అవసరం చాలా ఉంది.. దీపక్ హుడాపై సంజయ్ మంజ్రేకర్...
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి భారత సీనియర్ టీమ్ సిద్ధమవుతుంటే, ఐర్లాండ్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత జూనియర్ టీమ్ టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతోంది. చిన్న జట్టు అయినప్పటికీ ఐర్లాండ్‌పై టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది...

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యంగ్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌లో ఆడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.. సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో వీరి ఎంట్రీ దాదాపు ఖాయమే...
Rahul Tripathi
అలాగే మొట్టమొదటిసారి టీమిండియాకి పిలుపు దక్కించుకున్న ఐపీఎల్ సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల వయసులో సెలక్టర్లను ఇంప్రెస్ చేసిన త్రిపాఠి, తనకి దక్కిన మొదటి అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి...
వీరితో పాటు మరో ఆల్‌రౌండర్ పర్పామెన్స్ గురించి కూడా తాను ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నానని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
‘ఐర్లాండ్ పర్యటనని దీపక్ హుడా చక్కగా వాడుకుంటాడని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో హుడా నుంచి బెస్ట్ పర్పామెన్స్ వచ్చింది. అతను ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు...
‘ఐర్లాండ్ పర్యటనని దీపక్ హుడా చక్కగా వాడుకుంటాడని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో హుడా నుంచి బెస్ట్ పర్పామెన్స్ వచ్చింది. అతను ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు...
ఎలాంటి పిచ్‌లో అయినా ఆ పనిని చక్కగా నిర్వహించగలడు దీపక్ హుడా. ఐపీఎల్‌లో ఆ పని అతను చేసి చూపించాడు. ఇండియాకి కూడా చేయగలడని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన దీపక్ హుడా, 15 మ్యాచుల్లో 451 పరుగులు చేశాడు... ఫినిషర్‌గా లక్నోకి కొన్ని మ్యాచుల్లో విజయాలను అందించాడు...
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో తుదిజట్టులోకి వచ్చిన దీపక్ హుడా, 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు వన్డేలాడి 55 పరుగులు చేశాడు..