- Home
- Sports
- Cricket
- Abhishek Sharma: 6 6 6 6 6 6.. వాంఖడేలో అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం.. అద్భుతమైన సెంచరీ
Abhishek Sharma: 6 6 6 6 6 6.. వాంఖడేలో అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం.. అద్భుతమైన సెంచరీ
india vs england: వాంఖడే స్టేడియంలో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

IND vs ENG : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత బ్యాటర్ల దెబ్బతో పరుగుల వర్షం వచ్చింది. ఫోర్లు సిక్సర్లతో టీమిండియా ప్లేయర్లు పరుగుల వరద పారించారు. కేవలం 6 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ దుమ్మురేపే షాట్లతో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ కూడా దుమ్మురేపే షాట్స్ ఆడటంతో భారత్ 7 ఓవర్ లోనే 100 పరుగుల మార్కును దాటింది. ఆ తర్వాత అభిషేక్ దానిని సెంచరీగా మార్చాడు.
టాస్ ఓడిన భారత్.. మరోసారి నిరాశపర్చిన సంజూ శాంసన్
భారత్, ఇంగ్లండ్ మధ్య T20 సిరీస్‌లో 5వ, చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమ్ ఇండియా తన ప్లేయింగ్-11లో చిన్న మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ షమీకి అవకాశం లభించింది.
తొలుత బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ, త్వరలోనే మరోసారి సంజూ శాంసన్ వికెట్ ను కోల్పోయింది. 7 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సంజూ తన ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఈ వికెట్ తో ఇంగ్లాండ్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.
Abhishek Sharma
అభిషేక్ శర్మ ధానధన్ ఇన్నింగ్స్.. గ్రౌండ్ దద్దరిల్లిపోయింది
సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. అప్పటి నుంచి భారత జట్టు పరుగుల సునామీ మొదలైంది. అభిషేక్ శర్మ వాంఖడేను షేక్ చేశాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్ తరఫున రెండో ఫాస్టెస్ హాఫ్ సెంచరీగా నిలిచింది.
ఆ తర్వాత కూడా మరింతగా రెచ్చిపోయిన అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్లు బాదడం ఆపలేదు. దీంతో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 270 స్ట్రైక్ రేటుతో తన బ్యాటింగ్ కొనసాగించారు. తన ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఇది అభిషేక్ శర్మకు రెండో టీ20 సెంచరీ. అలాగే, ఇది టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ రెండో సెంచరీగా నిలిచింది.
Image Credit: Getty Images
పవర్ ప్లేలో అత్యధిక స్కోరు.. చరిత్ర సృష్టించిన భారత్
అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో భారత్ పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మల సునామీ ఇన్నింగ్స్ తో భారత క్రికెట్ జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది.
ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు రికార్డు స్కాట్లాండ్ పేరిట ఉంది. 2021లో స్కాట్లాండ్ చేసిన 82/2 పరుగులు పవర్ ప్లే లో అత్యధిక స్కోరు. ఆ రికార్డును భారత్ ఇప్పుడు బ్రేక్ చేసింది.
మరోసారి త్వరగానే పెవిలియన్ కు చేరిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
తిలక్ వర్మ ఔట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేవలం రెండు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బ్రైడెన్ కార్సే బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడబోయే గాల్లోకి కొట్టాడు. దీంతో కీపర్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. దీంతో భారత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
శివం దుబే వచ్చిన వెంటనే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. 13 బంతుల్లో 32 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ 182-4 (13.2) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.