MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 781 పరుగులతో విధ్వంసం.. ప్రపంచ వన్డే క్రికెట్ లో గొప్ప రికార్డు

781 పరుగులతో విధ్వంసం.. ప్రపంచ వన్డే క్రికెట్ లో గొప్ప రికార్డు

ODI 781 Runs World Record Match: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మహిళల మూడో వన్డేలో పరుగుల సునామీ వచ్చింది. ఏకంగా 781 పరుగులతో ప్రపంచ రికార్డు నమోదైంది. మంధాన-మూనీ సెంచరీలతో దుమ్మురేపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2025, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రికార్డుల మోత మోగించిన మహిళల వన్డే క్రికెట్
Image Credit : BCCI

రికార్డుల మోత మోగించిన మహిళల వన్డే క్రికెట్

ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ మహిళల వన్డే చరిత్రలో కొత్త రికార్డులు నమోదుచేసింది. ఇరు జట్ల ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల సునామీ తెచ్చారు. మొత్తం 781 పరుగులు సాధించి వరల్డ్ రికార్డ్‌ నమోదుచేశారు. ఇంతకు ముందు 2017లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 678 పరుగులు నమోదు కాగా, ఆ రికార్డ్ ఈ సిరీస్‌లో బద్దలైంది.

26
ఆస్ట్రేలియా 412 పరుగులతో దుమ్మురేపింది
Image Credit : X/BCCIWomen

ఆస్ట్రేలియా 412 పరుగులతో దుమ్మురేపింది

సిరీస్ 1-1తో సమమైంది. డిసైడర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ఓపెనర్ బెత్ మూనీ 75 బంతుల్లో 138 పరుగులతో సునామీ నాక్ ఆడారు. ఫోర్ల వర్షం కురిపిస్తూ భారత బౌలింగ్ ను దంచికొట్టారు. ఆమె తన ఇన్నింగ్స్‌లో 23 బౌండరీలు, ఒక సిక్స్ బాదారు. జార్జియా వాల్ 81 పరుగులు, పెర్రీ 68 పరుగులు చేశారు. ఆఖరులో ఆష్లే గార్డ్నర్ 39 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా స్కోరు 47.5 ఓవర్లలో 412 పరుగులకి చేరింది. దీంతో  మహిళా వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డును సమం అయింది. 

Related Articles

Related image1
హెచ్1బీ వీసా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. ఆందోళనలో ఎన్నారైలు
Related image2
భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్
36
స్మృతి మంధాన ధనాధన్ బ్యాటింగ్
Image Credit : X/BCCIWomen

స్మృతి మంధాన ధనాధన్ బ్యాటింగ్

412 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. ఇన్నింగ్స్ మరింత బలంగా మొదలెట్టింది. స్మృతి మంధాన దూకుడు మామూలుగా లేదు భయ్యా.. కొడితే ఫోర్ లేదా సిక్సు అనేలా ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టింది. 

మంధనా కేవలం 50 బంతుల్లో సెంచరీ బాదింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సాధించింది. అలాగే, మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. మంధాన 63 బంతుల్లో 125 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని అందించింది. దీంతో భారత్ మ్యాచ్ ను ఈజీగానే గెలుచుకుంటుందని అనిపించింది. అయితే, మంధాన అవుట్ అయ్యాక భారత్ ఒత్తిడిలో జారుకుంది.

46
భారత బ్యాటింగ్ ఎలా సాగింది?
Image Credit : X/AusWomen

భారత బ్యాటింగ్ ఎలా సాగింది?

మంధాన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ 52 పరుగులు, దీప్తి శర్మ 72 పరుగులు చేసి భారత్‌ ను గెలుపు వైపు నడిపించారు. కానీ, మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఓటమిపాలైంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులకే ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని అందుకోకపోయినా, వన్డే చరిత్రలో టార్గెట్ ఛేజ్ చేస్తూ అత్యధిక 369 పరుగులు చేసిన జట్టుగా రికార్డులో నిలిచింది.

56
ఈ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఇవే
Image Credit : X/BCCIWomen

ఈ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఇవే

ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి.

• మహిళా వన్డేలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక 781 పరుగులు నమోదయ్యాయి.

• ఆస్ట్రేలియా 412 పరుగులతో వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ ను సమం చేసింది.

• భారత్ టార్గెట్ ఛేజ్ చేస్తూ 369 పరుగులు చేసి కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

• మ్యాచ్‌లో మొత్తం 111 బౌండరీలు (99 ఫోర్లు, 12 సిక్స్‌లు) నమోదయ్యాయి.

• మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు కలిపి 1826 పరుగులు చేసి మరో ప్రపంచ రికార్డ్ సృష్టించాయి.

• మంధాన 50 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది.

• బెత్ మూనీ 57 బంతుల్లో సెంచరీ చేసి మహిళా వన్డే చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది.

66
చరిత్రలో నిలిచిన భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్
Image Credit : X/AusWomen

చరిత్రలో నిలిచిన భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ మొత్తం క్రికెట్ అభిమానులకు ఎన్నో అద్భుతమైన క్షణాలను అందించింది. ఒక్క మ్యాచ్‌లో 781 పరుగులు రావడం, ఒకే సిరీస్‌లో 1800 పైగా పరుగులు నమోదవడం, రెండు జట్ల ఆటగాళ్లు సెంచరీల మోత మోగించడం, సునామీ ఇన్నింగ్స్‌లు ఆడి కొత్త రికార్డులు సాధించడం.. ఇలా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనలకు ఈ సిరీస్ వేదికైంది. క్రికెట్ చరిత్రలో మాస్టర్ క్లాస్ వన్డే సిరీస్ గా గుర్తింపు సాధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఆఖరి ఛాన్స్? జింబాబ్వే మ్యాచ్‌లో గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదే
Recommended image2
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
Recommended image3
Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?
Related Stories
Recommended image1
హెచ్1బీ వీసా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. ఆందోళనలో ఎన్నారైలు
Recommended image2
భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved