- Home
- Sports
- Cricket
- 3 సెషన్లు, 88 పరుగులు, 10 వికెట్లు... ఆసక్తికరంగా మారిన అహ్మదాబాద్ టెస్టు ఐదో రోజు...
3 సెషన్లు, 88 పరుగులు, 10 వికెట్లు... ఆసక్తికరంగా మారిన అహ్మదాబాద్ టెస్టు ఐదో రోజు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మొదటి మూడు టెస్టులు చప్పగా సాగాయి. తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఆధిపత్యం సాగితే, మూడో టెస్టులో ఆస్ట్రేలియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. ఈ మూడు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. అయితే ఆఖరి టెస్టు అసలు సిసలు టెస్టు మజాని అందిస్తోంది...

Virat Kohli
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 167 ఓవర్లు బ్యాటింగ్ చేసి 480 పరుగులు చేసింది. అక్కడెక్కడో కంగారుల దేశం నుంచి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్లే ఇంత స్కోరు కొడితే, లోకల్ బాయ్స్ తక్కువ కాకూడదని... టీమిండియా 178 ఓవర్లు బ్యాటింగ్ చేసి 571 పరుగుల భారీ స్కోరు చేసింది...
Image credit: PTI
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బ్యాటింగ్‌కి రాలేదు కానీ లేకపోతే టీమిండియా స్కోరు ఈజీగా 600 దాటి ఉండేది. అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు...
Image credit: PTI
ఉస్మాన్ ఖవాజా స్థానంలో మ్యాట్ కుహ్నేమన్ నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చి, 18 బంతులాడి పరుగులేమీ చేయకుండా క్రీజులో నిలబడ్డాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా, 3 పరుగులు ఇచ్చి.. వికెట్ తీయలేకపోయింది. నాలుగో రోజు ఆఖర్లో వికెట్ పడి ఉంటే, ఆస్ట్రేలియాపై మరింత ఒత్తిడి పెరిగి ఉండేది...
Image credit: PTI
మొదటి రెండు రోజులు పిచ్ స్పిన్నర్లకు ఏ మాత్రం సహకరించలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లు దీన్ని కరెక్టుగా వాడుకుని క్రీజులో పాతుకుపోయాయి. అయితే నాలుగో రోజు పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించింది. ఐదో రోజు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే...
Image credit: Getty
ఐదో రోజు పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే, అశ్విన్- జడేజా- అక్షర్ పటేల్ త్రయం చెలరేగిపోవడం ఖాయం. ఈ ముగ్గురూ ఆస్ట్రేలియాపై విరుచుకుపడితే నాగ్‌పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుద్ది. అయితే ఆసీస్ పరువు నిలుపుకోవాలని గట్టిగా ఫిక్స్ అయితే వికెట్లకు అడ్డుగా పాతుకుపోవాల్సిందే...
మొదటి రోజు 4 వికెట్లు పడగా, రెండో రోజు ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో వికెట్ కోల్పోలేకపోయింది. రెండో సెషన్‌లో 3, ఆఖరి సెషన్‌లో 3 వికెట్లు పడ్డాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా, నాలుగో ఇన్నింగ్స్‌లో అలాంటి ఆటతీరు చూపిస్తే... మ్యాచ్‌ని డ్రా చేసుకోగలుగుతుంది..
తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం దక్కిన తర్వాత ఆఖరి రోజు టీమిండియా ఓడిపోవాలంటే.. మ్యాజిక్ జరగాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా ముందు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 80-90 ఓవర్లు బ్యాటింగ్ చేసి, డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రమే మిగిలింది..
మరోవైపు టీమిండియా గెలవాలంటే తొలి 2 సెషన్లలో 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా మొదటి రెండు సెషన్లలో 120-150 పరుగుల స్కోరు చేసినా కూడా ఆఖరి సెషన్‌లో టీమిండియా ముందు 30-60 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంటుంది... అది కొట్టడం కష్టమేమీ కాదు...
అహ్మదాబాద్‌లో ఆఖరి టెస్టు, ఆఖరి రోజులో ఎవరి ఆధిక్యం సాగుతుంది? ఆస్ట్రేలియా టెస్టును డ్రా చేసుకుంటుందా? లేక టీమిండియా లాంఛనాన్ని పూర్తి చేసి 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుందా? అనేది తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే..