విరాట్ కోహ్లీ ఇంత ఒత్తిడిలో ఉన్నాడా... కెప్టెన్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రెషర్...
INDvsAUS: మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భిన్నంగా ఉంటుంది. ఎన్ని మ్యాచుల్లో ఓడినా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైనా ఎలాంటి ఒత్తిడి లేనట్టుగా కూల్‌గా కనిపిస్తాడు మహేంద్ర సింగ్ ధోనీ, కానీ విరాట్ కోహ్లీ అలా కాదు. ఒక్క క్యాచ్ మిస్ చేసినా తీవ్రమైన ఆవేశానికి లోనవుతాడు. అలాంటి రెండు మ్యాచుల్లో ఓడితే, అతనిలో ఏ రేంజ్ ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ 2020 తర్వాత భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టింది టీమిండియా. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారత టాప్ బౌలర్లు బుమ్రా, షమీ, సైనీ అదరగొడతారని భావించారంతా.
అయితే వన్డే సిరీస్ మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడింది టీమిండియా...
బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారీ లక్ష్య చేధనలో కొంత మేరకైనా ముందుకు నడించి, స్వల్ప తేడాలతో మ్యాచులను ముగించగలిగింది... అయితే బౌలర్ల వైఫల్యం మాత్రం భరించలేనిది.
నిప్పులు చెరిగే బంతులు వేస్తాడని, వరల్డ్‌లో బెస్ట్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా... రెండు వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు...
మొదటి వన్డేలో మూడు వికెట్లు తీసి మెప్పించిన మహ్మద్ షమీ... రెండో వన్డేలో తేలిపోయాడు. ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఇక నవ్‌దీప్ సైనీ కూడా చెప్పాల్సిన అవసరమే లేదు...
మొదటి వన్డేలో 83 పరుగులు ఇచ్చిన నవ్‌దీప్ సైనీ... రెండో వన్డేలో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చాడు. సైనీని నమ్మి, అతనికి వరుసగా రెండు వన్డేల్లో ఛాన్స్ ఇచ్చిన కోహ్లీకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రెండు వన్డేల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీసిన చాహాల్... 19 ఓవర్లలో 160కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.
మొదటి వన్డేలో బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో బాగానే బ్యాటింగ్ చేశాడు. 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేసి సెంచరీ దగ్గర్లో అవుట్ అయ్యాడు...
అయితే విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. భారత బౌలర్లు ఘోరంగా విఫలం అవుతుండడంతో ఏం చేయాలో తెలియక ప్రెషర్ ఫీలవ్వడం కోహ్లీ ముఖంలో కొట్టిచ్చినట్టు కనిపించింది.
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా కాస్త ఒత్తిడిలో కనిపించిన కోహ్లీ... అవుట్ అయ్యాక అసహనం వ్యక్తం చేశాడు. హెండ్రిక్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో కోహ్లీని అవుట్ చేసినప్పుడు అలా ఒక్క నిమిషం నిశ్శబ్దంలో కూరుకుపోయాడు విరాట్.
త్వరలో తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ... ఆ ప్రెషర్ కూడా ఫీల్ అవుతున్నాడు. ఒంటరిగా ఉన్న అనుష్క శర్మ గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతున్నట్టు అర్థం అవుతోంది.
విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నప్పుడు పక్కనే ఉండి, అతని భారాన్ని తగ్గించే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం కోసం భారత కెప్టెన్‌పై తీవ్రమైన ప్రభావం చూపినట్టుంది. .
ప్రస్తుత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా విరాట్ లాగే ఎమోషనల్ కావడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగిపోయిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. విరాట్ కోహ్లీ ఈ ఒత్తిడి నుంచి దూరం కావాలంటే భారత జట్టుకి ఓ మంచి విజయం దక్కాలి.
మొదటి రెండు వన్డేలు ఓడి, వన్డే సిరీస్ అప్పగించిన విరాట్ సే, మూడో వన్డేలో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే చివరి వన్డే విజయం కూడా బౌలర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది.