MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

IND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

India vs Australia: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2025, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

IND vs AUS Champions Trophy Semi Final Live: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్పెషల్ నాక్ లతో భారత జట్టు విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు సూపర్ విక్టరీ అందుకుంది. ఐదో సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. కేెల్ రాహుల్ సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Virat Kohli vs Australia

Virat Kohli vs Australia

టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో ఆసీస్ 264 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఆరంభంలో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. అయితే, అతన్ని వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ తో అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ స్లో అయింది. మధ్యలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలు మంచి నాక్ లు ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 200 పరుగుల మార్కును అందుకుంది. అయితే, భారత బౌలర్లు రాణించడంతో వికెట్లు పడటం ఆగలేదు. దీంతో భారత్ 264 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 39, స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61, మార్నస్ లబుషేన్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. 

34
Image Credit: Getty Images

Image Credit: Getty Images

265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మంచి శుభారంభం లభించలేదు. 20 పరుగుల వద్ద గిల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత 50 పరుగుల లోపే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. అయితే, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అద్బుతమైన ఆటతో టీమిండియాను విజయం వైపు నడిపించారు. చివరలో కేెల్ రాహుల్, హర్దిక్ పాండ్యాలు మంచి ఇన్నింగ్స్ లతో భారత్ విజయాన్ని అందుకుంది.

44
Image Credit: Getty Images

Image Credit: Getty Images

కేఎల్ రాహుల్ సిక్సర్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ విక్టరీ అందుకుంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 84 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42* ప‌రుగులు, హార్దిక్ పాండ్యా 28 ప‌రుగులు చేశారు. భార‌త జ‌ట్టు 48.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 267 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఎలిస్ 2, ఆడం జంపా 2 వికెట్లు తీసుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved